ఒక్కొక్కరికి ఒక్కోరకమైన హాబీ ఉంటుంది.  కొందరు తినే తిండి విషయంలో రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు.  తిండి విషయంలో ఎక్కడా రాజీపడరు.  కొంతమందైతే ఏది దొరికితే అది తినేందుకు సిద్ధం అవుతుంటారు.  మరికొందరు మాత్రం తినేముందు తినొచ్చాలేదా అని ఒకటికి పదిసార్లు అలోచించి ఆహరం తీసుకుంటారు.  కానీ, కొంతమంది మాత్రం..రాళ్లనుసైతం ఆరయించుకునే శక్తిని కలిగి ఉంటారు.  అలా అరాయించుకునే శక్తిని కలిగిన వ్యక్తుల్లో ఒకరు దయారం సాహు.  


మధ్యప్రదేశ్ లోని దిందోరి ప్రాంతానికి చెందిన సాహు గత 45 సంవత్సరాలుగా గాజు పెంకులు తింటున్నాడు.  ఆ అలవాటు ఎలా వచ్చిందో ఏమో తెలియదుగాని, చక్రాలు, జంతికలు తినేసినటు తినేస్తుంటాడు.  మాములుగా ఎవరికైనా గాజు ముక్కలు తింటే కడుపులో గుచ్చుకుంటాయనే భయం ఉంటుంది.  సాహు కు మాత్రం ఆ భయం లేదట.  పటపట నమిలి మించేస్తుంటాడు.  


దీంతో అయన కుటుంబం ఇంట్లో గాజు వస్తువులను ఉంచేందుకు భయపడిపోతున్నారు. 45 సంవత్సరాలుగా గాజు ముక్కలను తినడం అలవాటుగా మారిందని.. అయితే, పళ్ళు అరిగిపోవడంతో ఇటీవల కాలంతో తగ్గించినట్టు సాహు చెప్తున్నాడు.  ఎంత తగ్గించినా.. గాజు ముక్కలను ఎలా తింటున్నాడో అర్ధం కావడం లేదు.  ఎలాంటి ఆహరం తీసుకున్నా.. ఎందుకో సంతృప్తికరంగా ఉండదని, ఇలాంటి గాజులను ఆహారంగా తీసుకుంటేనే తృప్తిగా ఉంటుందని అంటున్నాడు.  


అయితే అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తున్నట్టుగా అనిపిస్తుందని, తరువాత అదే తగ్గిపోతుందని చెప్తున్నాడు.  చిన్నతనం నుంచి ఆ అలవాటు వచ్చినట్టు అయన తెలిపారు. ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు.  కొంతమంది ఐరెన్ కనిపిస్తే హాఫ్ ఫట్ చేస్తారు.  దాన్ని తినేంతవరకు నిద్రపోరు.  మరికొంతమంది ఇటుకలను కరకర నమిలేస్తుంటారు.  ఇంకొందరైతే.. మట్టి కనిపిస్తే.. చక్కర తిన్నట్టుగా తినేస్తుంటారు.  వారి శరీరం తీరును బట్టి ఇలా జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: