చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా మారినప్పటి నుండి పెయిడ్ ఆర్టిస్టులక డిమాండ్ ఫుల్లుగా పెరిగిపోయినట్లే కనిపిస్తోంది. బాధ్యత గల ప్రతిపక్షంగా ఉండాల్సిన టిడిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లటమనే ఏకైక పాయింట్ తో పనిచేస్తుండటంతోనే పనికిమాలిన రాజకీయాలు చేస్తోంది.  చంద్రబాబు వ్యవహారం ఏ స్ధాయికి చేరుకుందంటే జగన్ ఏ పని చేసినా అసలు ఏ పనీ చేయకపోయినా తప్పే అన్నట్లుగా తయారైంది.

 

చంద్రబాబు వ్యవహార శైలి ఇలా మారిపోవటానికి కారణాలు ఏమిటంటే తన హయాంలో జరిగిన అవినీతిపై జగన్ సమీక్షలు చేయటం, విచారణ కమిటిలను నియమించటమే అని అర్ధమైపోతోంది. జగన్ ను బ్లాక్ మెయిల్ చేసో లేకపోతే భయపెట్టో దారికి తెచ్చుకోవాలని చూస్తున్నట్లుంది చంద్రబాబు వ్యవహారం. అయితే ఇటువంటి బెదిరింపులకు జగన్ లొంగే రకం కాదని తెలుసుకోలేకపోతున్నారు.

 

చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు అణిచివేతకు గురిచేసినపుడే జగన్ బెదరలేదు. వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను లాక్కున్నపుడే  చంద్రబాబును జగన్ లెక్క చేయలేదు. నిజానికి చెప్పాలంటే జగన్ నిబ్బరం చూసి చంద్రబాబే భయపడిన రోజులున్నాయి.

 

దాంతో జగన్ వంద రోజుల పాలనపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి ఏమీ లేకనే పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపారు. ముందు వరదల సమయంలో రైతుతో జగన్, మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను తిట్టించారు. చివరకు సదరు రైతు టిడిపి పెయిడ్ ఆర్టిస్టని తేలిపోయింది. తర్వాత తిరుమలలో చర్చి నిర్మిస్తున్నారంటూ ప్రచారం చేసిన వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులే అని రూఢీ అయిపోయింది.

 

తాజాగా గుంటూరు శిబిరంలో ఉన్న వాళ్ళలో ఎక్కువమంది పెయిడ్ ఆర్టిస్టులనే విషయం బయట పడిపోయింది. ఏదో భోజనం దొరుకుతుందని, పొద్దు పోయిన తర్వాత బస్సులు లేవని, గుంటూరు ఆసుపత్రికి వచ్చిన వాళ్ళందరినీ నేతలు శిబిరాల్లో కట్టిపడేశారు. దాంతో శిబిరం  పెయిడ్ ఆర్టిస్టులతో నిండిపోయింది. చూడబోతే మిగిలిన కాలమంతా చంద్రబాబు పుణ్యమా అని పెయిడ్ ఆర్టిస్టులకు మంచి గిరాకీ దొరికేట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: