సరదాగా సాగరాన్ని చూద్దాం,అలా పాపికొండల వైభవాన్నితిలకిద్దాం అని ఆశపడ్డ వారినెందరినో ఆ గంగమ్మ తనగర్బంలో మళ్లీ లోకాన్నిచూపించనని దాచుకుంది. సరదా కోసం వెళ్లిన కొందరు,అవసరం నిమిత్తం వెళ్లిన కొందరు,వెళ్ళోస్తామని బంధువులకు,ఆప్తులకు చెప్పిన మాటతప్పి తిరిగిరాని లోకాన్ని చేరుకున్నారు.హృదయాలను పిండేసే అత్యంత విషాదకర సంఘటన..ఇది రెండు తెలుగురాష్ట్రాలకు తీరని వేదన మిగిల్చింది.తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటుమునిగి 36 మంది గల్లంతైన సంగతి తెలిసిందే.పాపికొండలను చూసేందుకు పర్యాటకులు లాంచీలో వెళ్తుండగా ఈ పెనువిషాదం చోటుచేసుకుందట.దీంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఇక ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి.యుద్ధ ప్రాతిపదికన గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు.అలాగే హెలికాఫ్టర్, ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు.ఇక మరణాన్ని దగ్గరగా చూసి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుని మృత్యుంజయులుగా కొందరు మిగిలారు.చిరకాల జ్ఞాపకంగా మిగలవలసిన ఈ ప్రయాణం,చివరి క్షణాలను కళ్లకు కట్టినట్లు చూపడంతో వారు భయభ్రాంతులకు లోనయ్యారు.కాగా ఈ ప్రయాణంలో చిరంజీవులుగా మళ్లీ మిగిలిన 25 మంది పర్యాటకుల వివరాలు ఇప్పుడు చూద్దాం..



1. గొర్రె ప్రభాకర్, ఖాజీ పేట
2. పూసల లక్ష్మీ, అనఖాపల్లి
3. సీహెచ్ జానకి రామారావు, ఉప్పల్, హైదరాబాద్
4. దుర్గం మధులత, తిరుపతి
5. కట్టిపోగు గాంధీ, విజయవాడ
6. ఆరపల్లి యాదగిరి, ఖాజీపేట, వరంగల్
7. బీ దసరయ్య, వరంగల్
8. బీ సురేష్, వరంగల్
9. భాస్క వెంకట స్వామి
10. ఎస్ రాజేష్, హైదరాబాద్
11. ఎమ్ కిరణ్ కుమార్, హైదరాబాద్
12. ఎన్ సురేష్, హైదరాబాద్
13. జెర్మనీ కుమార్, హైదరాబాద్



14. కే అర్జున్, హైదరాబాద్
15. ముజురుద్దీన్, హైదరాబాద్
16. మనడల్ గంగాధర్, నర్సాపురం
17. గొర్రిపర్తి సుబ్రమణ్యం, హునుమాన్ జంక్షన్
18. ఉంగరాల శ్రీను, హనుమాన్ జంక్షన్
19. మద్దెల జాజుబాబు, హనుమాన్ జంక్షన్
20. కంచెం జగన్నాథ రెడ్డి, కడప
21. వేడుల్ల నాగు, బోట్ వర్కర్, దేవీపట్నం
22. వీ కృష్ణ కుమార్ రెడ్డి, బోట్ వర్కర్, కొల్లూర్ విలేజ్
23. శివ, బోట్ డ్యాన్సర్
24. రోహిత్ బోట్ డ్యాన్సర్
25. నాగు, బోట్ డ్యాన్సర్



మరింత సమాచారం తెలుసుకోండి: