బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలోని  గురజాలలో బిజెపి ఆధ్వర్యంలో ఓ బహిరంగసభ నిర్వహించేందుకు నేతలు  ప్లాన్ చేశారు. అయితే గురజాల ప్రాంతంలో కొద్ది రోజులుగా 144వ సెక్షన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

 

చలో ఆత్మకూరంటూ చంద్రబాబునాయుడు చేసిన రచ్చ వల్ల కొద్ది రోజులుగా గురజాల ప్రాంతంలో పోలీసులు 144వ సెక్షన్ అమల్లో ఉంది. పల్నాడు ప్రాంతానికే చెందిన కన్నాకు ఈ విషయం తెలియనిదేం కాదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభ నిర్వహించాలని కన్నా నిర్ణయించారు.


అయితే జగన్ నూరు రోజుల పాలనకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహిస్తానంటే పోలీసులు ఎలా అనుమతిస్తారని అనుకున్నారో కన్నాకే తెలియాలి. ముందు బహిరంగ సభకు అనుమతిచ్చిన పోలీసులు తర్వాత అసలు ఉద్దేశ్యం తెలుసుకుని అనుమతిని రద్దు చేశారు.  అప్పటి నుండి కన్నా పోలీసులపై మండిపోతున్నారు. అనుమతిని రద్దు చేసిన నోటిసును ఇవ్వటానికి పోలీసులు ప్రయత్నించినా కన్నా నోటిసును తీసుకోలేదు.

 

ఒకవైపు పోలీసులు బహిరంగసభకు అనుమతి నిరాకరించినా కన్న మాత్రం సభను జరిపి తీరుతామంటూ ఏర్పాట్లు చేసుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బహిరంగసభ జరగాల్సుంది. సభలో పాల్గొనేందుకు కన్నాతో పాటు బిజెపి నేతలు, శ్రేణులు వేదిక దగ్గరకు చేరుకుంటున్నారు. అదే సమయంలో బిజెపి నేతలను అడ్డుకునేందుకు, సభను భగ్నం చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

 

ఈ నేపధ్యంలోనే సభ జరిగే వేదిక దగ్గరకు తన మద్దతుదారులతో బయలుదేరిన కన్నాను మధ్యలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  దాంతో కన్నాకు పోలీసులకు మధ్య వాగ్వాదం చేటు చేసుకుంది. ఎంతసేపు వాదించినా సరే సభను మాత్రం జరిపనిచ్చేది లేదంటూ పోలీసులు కన్నాకు తెగేసి చెప్పారు.  ఎంతకీ వినకపోవటంతో చివరకు పోలీసులు కన్నాను అదుపులోకి తీసుకున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: