పాలపికొండలు టూర్ కి ప్రయాణికులతో బయల్దేరిన బోట్  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చలూరు వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసందే . నిన్న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందగా ...ఇంకా కొన్ని మృతదేహాలని వెలిక్కి తీసేందుకు గాలింపు  చర్యలు చేపట్టారు  అధికారులు .కాగా ఈ ప్రమాదం నుండి 25  మంది బయట పడగా ...36 మంది ఆచూకీ గల్లంతయ్యింది . మృతుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు ఉండటం తో ...రెదను రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి .అయితే ఈ బోట్ ప్రమాదం పై స్పందించినఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ...మృతులకు  10  లక్షల  ఎక్స్‌గ్రేషియో ఇస్తామని ప్రకటించటం తో పాటు ...సహాయ చర్యలను ముమ్మరం చేయాలనీ అధికారులను ఆదేశించారు .


కాగా తాజాగా జరిగిన బోటు ప్రమాదాన్ని గతంలో దేవి పట్నం దగ్గర జరిగిన ప్రమాదం తో పోలుస్తూ  వైసీపీ ఎమ్మెల్యే రోజా పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు . ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ...రోజా స్పందించిన తీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రోజా స్పందిస్తున్న తీరును కంపేర్ చేస్తూ నెటిజన్లు రోజా తీరు పై కామెంట్స్ చేస్తున్నారు . గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బోట్ ప్రమాదం జరగ్గా ... ప్రభుత్వం పై విరుచుకు పడింది రోజా . అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పందించిన ఎమ్మెల్యే రోజా గారు ... మరి ఇప్పుడు ఎందుకు స్పందించటం లేదు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు . 


కాగా మరో నెటిజన్ ఈ ప్రమాదం గురుంచి రోజా పై తీవ్ర స్థాయిలో మంది పడ్డాడు .  ‘ గోదావరి ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ ఎవరెవరు రాజీనామాలు చేస్తున్నారు..? గత ప్రభుత్వంలో ఏచిన్న పొరపాటు జరిగినా లబో-దిబో మంటూ గుండెలు బాదుకున్న 'రోజా' ఈరోజు ఘటనపై బాదుకోలేదే..? ముఖ్యమంత్రి రాజీనామాను కొరలేదే..?అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు . మరి ఈ ప్రశ్నలపై  వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే


మరింత సమాచారం తెలుసుకోండి: