ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు మృతి చెందారు. కోడెల ఇటీవలే గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అనేక కేసులతో కోడెల తీవ్ర మనస్తాపానికి గురయినట్లు తెలుస్తోంది. ఈ కేసుల వలన కోడెల కుటుంబంలో కూడా మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
కోడెల శివ ప్రసాద రావు కొంత సమయం క్రితం ఇంట్లో ఉరి వేసుకొని అనుమాస్పద స్థితిలో కనిపించటంతో బసవతారకం ఆస్పత్రికి తరలించారని తెలుస్తుంది. ఇటీవల కోడెలపై వస్తున్న ఆరోపణలు, కేసులతో కోడెల తీవ మనస్తాపానికి గురయ్యాడని తెలుస్తోంది. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం మరియు కొడుకు, కూతురు మీద కేసుల వలన కోడెల ఒత్తిడికి గురయ్యాడని తెలుస్తుంది. 
 
కోడెల శివ ప్రసాద్ డాక్టర్ గా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తరువాత కోడెల తొలి స్పీకర్ గా పని చేశారు. ఒక మంచి వైద్య వృత్తిలో నుండి కోడెల రాజకీయాల్లోకి వచ్చారు. హోం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కోడెల పనిచేశారు. కోటప్పకొండ దేవాలయంను కూడా కోడెల అభివృధ్ధి చేశారు.కోడెలపై  వస్తున్న కేసులను కోడెల చాలా అవమానంగా ఫీల్ అయినట్లు తెలుస్తుంది. కుటుంబసభ్యుల చుట్టూ కేసులు రావటంతో ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలుస్తోంది. 
 
కోడెలపై విమర్శలు వచ్చినపుడు టీడీపీ పార్టీలోని కొంతమంది విమర్శలు చేశారని కూడా తెలుస్తుంది. కోడెల కొడుకు షోరూంలో ఫర్నిఛర్ దొరకటం కూడా కోడెలను కొంతవరకు ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. కోడెలకు పార్టీ నుండి మరియు నేతల మద్ధతు రాకపోవటంతో కూడా తీవ్ర మనస్తాపానికి గురయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఒత్తిడితో కోడెల శివ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆసుపత్రి వర్గాల నుండి ఈ విషయం గురించి పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: