ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ (72) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కోడెల తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా.. గత కొన్ని రోజులుగా ఈయన్ను కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.


ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల శివప్రసాదరావుతో పాటు ఆయన కుటుంబంపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యులు కోర్టును కూడ ఆశ్రయించారు.


కొద్ది రోజుల క్రితం గుండెనొప్పి కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం ఆయన కోలుకొన్నారు. వరుసగా కోడెల శివప్రసాదరావుతో పాటు ఆయన కుటుంబంపై కేసులు నమోదయ్యాయి.


ఈ తరుణంలో కోడెల శివప్రసాదరావు మానసిక ఒత్తిడికి గురైనట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.


ఇక ఆయ‌న సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో ప్ర‌తి అడుగు ఇలా ఉంది...


1947 మే 2 = గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో జ‌న‌నం


1982 = ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిక‌


1983 = న‌ర‌సారావుపేట నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌... కాంగ్రెస్ అభ్య‌ర్థి బి.సుబ్బారెడ్డిపై విజ‌యం


1985 = రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపు... కాంగ్రెస్ అభ్య‌ర్థి కెవి.కృష్ణారెడ్డిపై గెలుపు


1989 = కాంగ్రెస్ గాలిలోనూ గెలిచి హ్యాట్రిక్‌... కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎం.రాధాకృష్ణ‌మూర్తిపై విజ‌యం


1994 =  నాలుగోసారి ఘ‌న విజ‌యం...కాంగ్రెస్ అభ్య‌ర్థి డి.బాల‌కోటిరెడ్డిపై విజ‌యం


1999 = ఐదోసారి గెలుపుతో వ‌రుస‌గా తిరుగులేని విజ‌యాలు...కాంగ్రెస్ అభ్య‌ర్థి కెవి.కృష్ణారెడ్డిపై గెఉల‌పు


2004 = కాంగ్రెస్ ప్ర‌భంజంలో తొలిసారి ఓట‌మి... కోడెల‌పై కెవి.కృష్ణారెడ్డి తొలిసారి విజ‌యం


2009 = రెండోసారి వ‌రుస‌గా కాసు వెంక‌ట కృష్ణారెడ్డి చేతిలో ఓట‌మి


2014 = స‌త్తెన‌ప‌ల్లికి మారి అక్క‌డ నుంచి ఆరోసారి అసెంబ్లీకి ఎన్నిక‌.. వైసీపీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబుపై 713 ఓట్ల‌తో గెలుపు


2019 = అంబ‌టి రాంబాబు చేతిలో ఓట‌మి


చేప‌ట్టిన ప‌ద‌వులు :
- 1987-88 మధ్యలో హోంమంత్రి


- 1996-97 భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రి


-  2014-19 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన పనిచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: