వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి ఒక్కసారిగా ఉరేసుకుని విగతజీవిగా మారాడు. పార్టీలో ప్రప్రథమ నేతగా వెలుగొందిన కోడెల శివప్రసాద్ అథమానికి పడిపోవడం వెనుక కారణాలు ఎన్నో. కేవలం తన సొంత జిల్లాలోనే అతనిపై కుటుంబంపై 30 కేసుల వరకు నమోదయ్యాయట. మొన్న ఈ మధ్యనే అసెంబ్లీలో ఫర్నిచర్ మరియు కంప్యూటర్లు తీసుకెళ్ళి తన ఇంటిలో మరియు తన కొడుకు నడుపుతున్న షాపులో ఉంచిన ఆరోపణలు వచ్చి చివరికి రైడ్ లో అన్నీ దొరకడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైన సంగతి తెలిసిందే.

అయితే కోడెల దగ్గర నుంచి అసెంబ్లీ సామాగ్రి మొత్తం రికవర్ చేసుకున్న తర్వాత తన సొంత పార్టీలోనే అతనికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైందట. అతని వల్ల తమ పార్టీ అప్రతిష్టత మూటగట్టుకుందని వారి పార్టీలోని నేతలే కొంత దూరం పెట్టడం మొదలుపెట్టారట. ఇకపోతే వీటన్నిటి ఎన్నటికీ ఎడతెగని కుటుంబంలో కలహాలు చివరికి కోడెల మెడకు ఉచ్చుని బిగించాయి. 1983,85, 89, 94, 99 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన మహాప్రస్థానం ఉన్న కోడెల మొట్టమొదటిసారి నరసరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేశారు. 

ఆ తర్వాత వరుస ఎన్నికల్లో పరాజయం చవిచూసిన అతను 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి గెలుపొంది రాష్ట్రానికి అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు. తర్వాత అతనిపై విరామం లేకుండా వచ్చిన అభియోగాలు, నమోదైన కేసులు, పార్టీ మరియు కుటుంబం నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతల నడుమ ఆయన ఉరేసుకున్నాడు అని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఆసుపత్రి పాలైన కోడెల బయటకు రాగానే కేసులని కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పార్టీ నుంచి పెద్దగా సపోర్టు లేదు పైగా తన ఇంటి వారు కూడా కేసుల్లో ఇరుక్కున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోడలా వేరే దారిలేక ఉరేసుకున్నట్లున్నడు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తులు పల్లాలు చూసిన కోడెల ఒత్తిడికి తలొగ్గి ప్రశాంతత కోసం చివరికి చావుని ఆశ్రయించక తప్పలేదు. అతని ఆత్మకి చేకూరాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: