ఎన్టీఆర్ ఇచ్చిన స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల ప్రసాదరావు తెలుగుదేశం పార్టీలో తనదైన ముద్రను వేసుకున్నారు.  ఆరుసార్లు కోడెల అసెంబ్లీకి ఎంపికయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అయన హోమ్ శాఖామంత్రిగా, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.  పల్నాడులో పల్నాటి పులిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 2004, 2009 లో అయన అసెంబ్లీకి ఎన్నికల్లో ఓడిపోయారు.  అయితే, కోడెల శివప్రసాద్ తనకు మంచి పట్టున నరసరావు పేటను పక్కన పెట్టి సత్తెనపల్లి వెళ్లడం అన్నది చేసిన తప్పుల్లో ఒకటి కావొచ్చు.  


నరసరావుపేటలో ఉన్నట్టయితే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. అయన ఈరోజు ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం వచ్చేది కాదు.  సొంతప్రాంతం నుంచి బయటకు వెళ్లి.. మరో చోట పోటీ చేయడంతో అయన పరపతి తగ్గిపోయింది. అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికయ్యాక.. అయన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవడంపై కూడా అయన మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు.  2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.. 


ఆ సమయంలో స్పీకర్ గా కోడెల ఎంపికయ్యారు.  అనంతరం కోడెల... అసెంబ్లీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, 2019 లో ఎన్నికలు పూర్తయ్యాక, అసెంబ్లీకి సంబంధించిన కొంత ఫర్నిచర్ సొంత పనులకు ఉపయోగించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.  ఈ ఆరోపణలతో పాటు ఆయనపై కేసులు కూడా పెట్టారు.  కొన్ని రోజులుగా ఆయనపై రాజకీయంగా ఒత్తిడి వచ్చింది.  ఇలాంటి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో అయన హైదరాబాద్ వచ్చారు.  హైదరాబాద్ లో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  


ఎన్ని ఒత్తిడులు వచ్చినా అయన నరసరావుపేటలో ఉన్నట్టయితే.. ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చేవి కాదు.  ఇలా అయన మరణించేవారు కాదు.  ఎందుకంటే నరసరావుపేటలో ఉంటె ఆయన చుట్టూ ఎప్పుడు మందీమార్బలం ఉంటుంది.  ఆయనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు.  సొంతం అనుకున్న చోట ఎంతోకొంత బలం ఉంటుంది.  ఆ బలమే మనిషిని నిలబెడుతుంది.  డాక్టర్ గా, రాజకీయ నాయకుడిగా సుదీర్ఘమైన అనుభవం కలిగిన కోడెల ఇలా ఆత్మహత్యకు పాల్పడం నిజంగా విచారకరమైన విషయమని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: