ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎంత అవ‌కాశ వాదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అవ‌కాశ వాదానికి ఆయ‌న ప‌రాకాష్ట‌. ఎంతో మంది నేత‌ల‌ను ఆయ‌న త‌నకు అనుకూలంగా అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వాడుకుని.. అవ‌స‌రం తీరిపోయిన వెంట‌నే వారిని పూచిక పుల్ల మాదిరిగా తీసిప‌డేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు చేతిలో పోటుకు గురైన రాజ‌కీయ నేత‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లులుగా ఉన్నారు. వీరి లిస్ట్ చాంతాడంత ఉంటుంది.


ఇక ఈ లిస్టులోనే దివంగ‌త నేత కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కూడా వ‌స్తారు. ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించేందుకు చంద్ర‌బాబు కోడెల‌ను వాడుకున్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఆశ చూపిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌వి సంగ‌తేమో గాని జిల్లా రాజ‌కీయాల్లోనూ ఆయ‌నను సైడ్ చేస్తూ వ‌చ్చారు. కోడెల కంటే జూనియ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇస్తూ కోడెల‌ను ప‌క్క‌న పెడుతూ వ‌చ్చారు.


2014  ఎన్నిక‌ల్లో కోడెల‌కు సీటు ఇచ్చే విష‌యంలో చాలా ఇబ్బందులు పెట్టారు. ఇక సీనియ‌ర్‌గా ఉన్న కోడెల గెలిచినా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. చివ‌ర‌కు బ‌తిమిలాడించుకుని స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చారు. అక్క‌డ కూడా తాను చెప్పిన‌ట్టు ఆడాల‌న్న కండీష‌న్లు చాలానే పెట్టారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో అస‌లు కోడెల‌కు సీటు ఇవ్వ‌కుండా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు. చివ‌ర‌కు స‌త్తెన‌ప‌ల్లిలో పోటీ చేసి ఓడిపోయారు.


ఇక ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో కోడెల‌తో పాటు కుటుంబంపై వరసగా ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుండటం కూడా కోడెలను కలిచి వేసింది. అయితే అటు బాబు కాని... ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు అండగా నిలబడక పోవడం కూడా కోడెలకు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. బాబు త‌న‌ను వాడుకుని వ‌దిలేశారని... ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. అదే టైంలో కోడెల‌ను కావాల‌నే చివ‌ర్లో జిల్లాలో ఒంట‌రి చేయ‌డంపై కూడా ఆయ‌న కుంగిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: