తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజకీయ దురంధరుడు కోడెల శివప్రసాదరావు జీవితం అత్యంత విషాదంగా ముగిసింది. నరసరావుపేటలో సర్జన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన రాజకీయంగా స్వయంకృషితో అంచెలంచలుగా పైకెదిగి గారు. ఆయ‌న ఉత్థానం స్వ‌యంకృషి అయితే ఆయ‌న ప‌త‌నం మాత్రం ఆయ‌న కుమారుడే. 1983లో ఎన్టీఆర్ పిలుపుమేరకు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కోడెల రెండు తెలుగు రాష్ట్రాల్లో తనదైన రాజకీయ ముద్ర వేశారు. కోడెల రాజకీయంగా ఎంతో వెలుగు వెలిగారు.. అలాగే కొన్ని అపవాదులు సైతం ఎదుర్కొన్నారు. పార్టీ కోసం... చంద్రబాబు కోసం... ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో  తెలుగుదేశం పార్టీని బతికించుకోవడం కోసం కోడెల ఎన్నో త్యాగాలు చేశారు.


చివ‌ర‌కు ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం సైతం త్యాగం చేశారు. ఇక కెరీర్ చివ‌ర్లో వార‌సులు పెట్టిన ఇబ్బందుల‌తో ఆయ‌న ప‌డిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అదే టైంలో ఈ ఎన్నిక‌ల‌కు ముందు కూడా కోడెల‌కు సీటు ఇచ్చేందుకు చంద్ర‌బాబు ఒప్పుకోలేదు. చివ‌ర వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టి బాబు సీటు ఇచ్చారు. స‌త్తెన‌ప‌ల్లిలో స‌న్‌స్ట్రోక్ గ‌ట్టిగా త‌ల‌గ‌డంతో కోడెల ఓడిపోయారు. ఇక వరసగా ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుండటం కూడా కోడెలను కలిచి వేసింది.


వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తున్న ప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు అండగా నిలబడక పోవడం కూడా కోడెలకు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. పార్టీ జిల్లాలో ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు కోడెల చేసిన త్యాగాలు, ప‌డిన క‌ష్టం మ‌ర్చిపోయిన చంద్ర‌బాబు అస‌లు కోడెల కేసుల విష‌యంలో ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా.. సొంత పార్టీ నేత‌ల‌తోనే ఆయ‌న‌దే త‌ప్ప‌న్న‌ట్టుగా కూడా మాట్లాడించారు.


బాబు చేసిన ద్వంద రాజ‌కీయంతో కోడెల మ‌రింత‌గా కుంగిపోయారు. త‌న ఫ్యామిలీని వైసీపీ ఇంత‌లా టార్గెట్ చేస్తున్నా... పార్టీ పరంగా తనను పట్టించుకోలేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన‌ట్టు కూడా తెలిసింది. ఇక బాబు కోడెల‌తో ఫోన్లో మాట్లాడేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. ఇవ‌న్నీ జీర్ణించుకోలేని ఆయ‌న త‌న‌కు పార్టీ నుంచి ఎలాంటి స‌పోర్ట్ లేక‌పోవ‌డంతో డిఫెన్స్‌లోకి వెళ్లిపోయాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: