టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతి అనేక అనుమానాలకు దారి తీస్తోంది. గుండెపోటుతోనే మృతి చెందారని డాక్టర్లు నిర్ధారిస్తున్నప్పటికీ ఆయన కుటుంబంలో ఉన్న అంతర్గత కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై టీడీపీ వర్గాలు రాజకీయ కోణాలను సృశిస్తున్నాయి. వ్యక్తి మృతిని రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇందుకు తాజా రాజకీయ పరిణామాలను ఉదహరిస్తోంది. 

 

 

 

అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల తన సొంతానికి వాడుకున్నారనే వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనికి ఆయన డిఫెన్స్ ఇచ్చుకోలేక పోయారు. సొంత పార్టీ నుంచి కానీ సాక్షాత్తూ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి ఆయనకు ఎటువంటి భరోసా లేకపోయింది. ఒకానొక సందర్భంలో ‘కోడెల తప్పు చేస్తే చర్యలు తీసుకోండి..’ అంటూ బహిరంగంగానే బాబు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ విషయంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు కోడెల అంశాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మలచుకుంటోందనే వార్తలొస్తున్నాయి. బసవతారకం ఆసుపత్రికి బాబు చేరుకున్నప్పటికీ ఆయన దీనిపై స్పందించలేదు. కానీ ప్రతి చోటా టీడీపీ నాయకులు స్పందిస్తూ.. కోడెలను వైసీపీ నాయకులు, జగన్ ప్రభుత్వం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. దీని ద్వారా ప్రజల్లోకి టీడీపీపై సానుకూల దృక్పధం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కోడెల ఫర్నీచర్ సొంతానికి వాడుకున్న అంశంలో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. 

 

 

 

కానీ టీడీపీ నాయకులు ఈ విషయం కాకుండా కోడెల మృతికి వైసీపీనే కారణమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వైసీపీ మీద విషం కక్కుతూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. దీనిపై టీడీపీ రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు, మనస్థాపం ఆయన ఆత్మహత్యకు దారి తీసుండొచ్చు.. అనే వ్యాఖ్యలు మాత్రం రావడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: