టీడీపీ సీనియర్ నేత , ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య ఆంధ్ర రాజకీయాల్లో పెను సంచలనం   రేపింది . రోజురోజుకి చుట్టుముడుతున్న కేసుల ఒత్తిడి ...కుటుంబకలహాల కారణంగానే కోడెల ఆత్మ హత్య చేసుకుని ఉంటారని కొంతమంది భావిస్తే ...లేదు వైసీపీ నేతలు కోడెలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ వేధించటం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు .ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్య పలు అనుమానాలకు తావిస్తోంది .అయితే దీనిపై  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు .


బసవతారకం ఫౌండర్ ,ఛైర్మన్‌గా ఉన్న కోడెల శివప్రసాద్అ రావు అదే  ఆస్పత్రిలో  కన్నుముయ్యటం  దురదృష్టకరం.అధికార పార్టీ అయన మీద రాజకీయంగా ఒత్తిడి తేవటం వల్లే చనిపోయారు . అయితే ఆసుపత్రికి రాకముందే అయన మీద పై వాతలు ఉన్నాయి . శవపరీక్ష కోసం భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తాం...  పోస్టుమార్టం రిపోర్టులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు .  ఐదేళ్ల పాటు ఆయన స్పీకర్‌గా ఉండగా, ఆ కాలమంతా వివాదాల్లోనే ఉన్నారు.అయితే అప్పట్లో కోడెల వరుస రోపణలు ఎదురుకుంటున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా మనకి వ్యతిరేకంగా మారారు . అయితే కోడెల నిన్న రాత్రి ఆయన కొడుకుతో గొడవ పడినట్లు సమాచారం ...ఓ వైపు కేసుల ఒత్తిడి మరో వైపు కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్యకి పాల్పడినట్లు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో గుంటూరులోని టీడీపీ  పార్టీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు కోడెల  చనిపోవడానికి గల కారణాలు , తదితర అంశాలపై టీడీపీ సీనియర్ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చిస్తున్నారు.   అయితే కోడెల మృతిపై పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు .కోడెల మృతిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: