ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న ఈయన మొదటి నుండి తెలుగు దేశం పార్టీలో ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కోడెల శివ ప్రసాద్.         

 

అయన రాజకీయ జీవితంలో ఎన్నో పనులు చేశారు. పార్టీ గెలిచినా ఓడిన అదే పార్టీలో ఉండి పార్టీకి అండగా ఉన్నారు కోడెల. చివరికి తెలుగు దేశం పార్టీలో ఉన్న సమయంలోనే అయన మృతి చెందారు. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుమానాలను వ్యక్తం చేశారు. కోడెల ఒంటిమీద గాయాలు ఉన్నాయని, కోడెల శివ ప్రసాద్ ఉరి వేసుకొనే అంత పిరికివాడు కాదని ఆయన వ్యాఖ్యానించారు.          


కాగా కోడెల భౌతికాయాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అయన తెలిపారు. పరిస్థిని చంద్రబాబు సమీక్షిస్తున్నారని అయన తెలిపారు. కాగా పోస్టు మార్టం అనంతరం కోడెల కుటుంబ సభ్యులు, కొడుకు, అల్లుడితో మాట్లాడి భౌతికకాయాన్ని గుంటూరుకు తరలిస్తామని అయన తెలిపారు. కాగా అయన అభిమానులు ఆఖరి చూపు చూడటానికి గుంటూరులోని టీడీపీ కార్యాలయం చెప్పారు.        


 కాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆత్మహత్య చేసున్న కోడెల శివ ప్రసాద్ ఒంటిపై గాయాలు ఉన్నాయి అనడం ప్రస్తుతం సంచలనమైంది. అయితే ఈ ఆరోపణలు నిజామా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే తెలుస్తుంది.           


మరింత సమాచారం తెలుసుకోండి: