అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కేసు పై ఇప్పటికే అనేకానేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ ఇది ఆత్మహత్య అంటుండగా... తెదేపా వర్గాలు మాత్రం గుండెపోటుతో మరణించారు అని వాదిస్తున్నారు. కొంతమంది అతని ఒంటిపై గాయాలు ఉన్నాయి అంటే మరి కొంతమంది ఆయన రాత్రి ఎవరితోనో తగాదా పడ్డాడని అంటున్నారు. వీటన్నింటి నడుమ ఎక్కువ మొత్తంలో వస్తున్న వార్తలు కోడెల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నాయి.

అయితే ఈ విషయంపై ఒక స్పష్టత ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ స్పెషలిస్ట్ అయిన అంజనీ కుమార్ ను ఈ కేసు విషయమై దర్యాప్తు చేయమని నియమించారు. అంజనీ కుమార్ మాట్లాడుతూ కోడెల శివప్రసాదరావు అనుమానస్పద మృతి పై తాము ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు... మూడు టీము లు విడిపోయి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. బంజారాహిల్స్ ఏసిపి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని అతని చావుకు సంబంధించి ఏ ఒక చిన్న విషయాన్ని కూడా వదలకుండా పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు.

అంజనీ కుమార్ చెబుతున్న దాని ప్రకారం శివప్రసాదరావు మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపిన తర్వాత అందులో వచ్చిన రిపోర్ట్ ద్వారానే అతని మరణానికి కారణం ఏమిటి విషయం పై క్లారిటీ వస్తుందని అన్నాడు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ తాము విచారిస్తున్నట్లు మరియు మృతి జరిగిన స్థలం వద్ద ఇప్పటికే తమ క్లూస్ టీం మరియు టెక్నికల్ టీం దర్యాప్తు చేస్తున్నారని.... తర్వాత వారు సేకరించిన ప్రతి ఒక్క క్లూ ని తమ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించి ఒక పక్కా నివేదిక తయారు చేస్తామని కూడా తెలిపారు. ఒక రాష్ట్రానికే మాజీ స్పీకర్ మృతిపై వస్తున్న అనుమానాలపై ఇవాళ అర్ధరాత్రికి రాబోయే పోస్టుమార్టం మరియు ఫోరెన్సిక్ రిపోర్ట్ తో నిజమేమిటో బట్టబయలు కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: