ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఈరోజు మృతి చెందారు. ప్రస్తుతం కోడెల వయస్సు 72 సంవత్సరాలు. కోడెల ఎలా మరణించారనే విషయం గురించి ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. కోడెల మృతి గురించి భిన్నమైన కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. కోడెల గుండెపోటుతో చనిపోయారని కొందరు చెబుతుంటే మరికొందరు మాత్రం ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసారని చెబుతున్నారు. 
 
కోడెల శివ ప్రసాద రావు కూతురు విజయలక్ష్మి కోడెల శివప్రసాద్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంది. కానీ కోడెల వ్యక్తిగత సిబ్బంది మాత్రం కోడెల గుండె పోటుతో చనిపోయాడని చెబుతున్నారు. కోడెల కుమార్తె టిఫిన్ చేశాక "నాన్న ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లారు. పైకి వెళ్లి చూసే సరికి ఉరి వేసుకొని కనిపించారు. గన్ మ్యాన్, డ్రైవర్ సాయంతో ఆసుపత్రికి తరలించామని చెప్పారు." కోడెల ఎటువంటి సూసైడ్ నోట్ రాయలేదని శివప్రసాద్ కూతురు విజయలక్ష్మి తన స్టేట్ మెంట్లో చెప్పింది. 
 
వ్యక్తిగత సిబ్బంది మాత్రం కోడెల శివప్రసాద రావుకు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. కోడెల మృతిపై రెండు భిన్న వాదనలు వినపడుతూ ఉండటంతో ఏది నిజమో ఏది అబధ్ధమో ఎవరికీ అర్థం కావటం లేదు. ఆసుపత్రి సిబ్బంది నుండి కూడా కోడెల మృతిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సిబ్బంది కొందరు కోడెలది ఆత్మహత్య అంటుంటే మరికొందరు మాత్రం గుండెపోటు అని చెబుతున్నారు. 
 
కోడెల మృతిలో కుటుంబ సభ్యుల నుండి వ్యక్తిగత సిబ్బంది నుండి భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉండటంతో కోడెల మృతిపై వీరికే సరైన అవగాహన లేదా ? లేక కోడెల మృతిలో ఏదైనా మిస్టరీ ఉందా? అనిపిస్తుంది. పోస్టుమార్టం నివేదిక వస్తే మాత్రమే కోడెల మరణం వెనుక నిజాలు తెలిసే అవకాశం ఉందని సమాచారం. కోడెల మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: