ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనూహ్యంగా తనువు చాలించడం పట్ల పలు రకాలైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్రుత్తి రిత్యా వైద్యుడిగా ఉన్న ఆయన రాజకీయాల్లోనూ డేరింగ్  అండ్ డేషింగ్ గా నిలబడ్డారు. ఆయన ఎన్నో ఒడుదుడుకులను  కూడా చవి చూశారు. ఆయన జీవితంలో అన్నీ దాటుకుని ముందుకువచ్చారు. అటువంటి కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటి అన్నది ఇపుడు చర్చగా ఉంది.


దీనికి కోడెల కుమార్తె విజయలక్ష్మి స్పందిస్తూ తమ తండ్రి చాలా కాలంగా ఒత్తిడిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆయన మరణం విషయంలో ఎవరి మీద ఎటువంటి అనుమానాలు లేవని కూడా చెప్పారు. తన తండ్రి ఈ రోజు ఉదయం ఇంటి పై అంతస్తులోకి వెళ్లారని, తరువాత ఆయన్ని పిలవడం కోసం వెళ్తే తలుపు తీయలేదని, దాంతో గది కిటికీ నుంచి చూస్తే ఉరి వేసుకుని కనిపించారని చెప్పారు.


కోడెల విషయంలో బతికించుకునేందుకు డ్రైవర్, గన్ మ్యాన్ సహాయంతో ఆసుపత్రికి తరలించామని చెప్పారు. జరిగింది ఇదేనని ఆమె అన్నారు. పై అంతస్తులోకి వెళ్ళడానికి ముందు కోడెల బ్రేక్ ఫాస్ట్ కూడా చేశారని ఆమె చెప్పారు. మరి ఈ విషయంలో కోడెల కుమార్తె చెబుతున్న దాని ప్రకారం ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని అర్ధమవుతోంది. మరి దీన్ని రాజకీయం చేయాలనుకుని టీడీపీ నేతలు ఉదయం నుంచి ఆయన్ని ప్రభుత్వమే చంపేసిందన్న ప్రచారం చేయడం వెనక పెద్ద రాజకీయమే ఉందని అంటున్నారు.


బతికి ఉన్నపుడు కొడెలను పక్కన పెట్టిన నాయకులంతా ఇపుడు పూనకం వచ్చినట్లుగా వూగిపోవడం వెనక ఫక్త్ రాజకీయమే తప్ప మరేమీ లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం కోడెల విషయంలో ఏం జరిగింది. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది పోస్ట్ మార్టం నివేదిక చెబుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: