తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణవార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కోడెల శివప్రసాద్ ఆరోగ్యరీత్యా చనిపోయారు అని కొందరు అంటుంటే లేదు లేదు ఆయన ఆత్మహత్య చేసుకున్నారని మరికొంతమంది అంటున్నారు. ఇటువంటి సందిగ్ద పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బావ బాలకృష్ణ కోడెల మరణంపై స్పందించిన విధానం ఒకలా ఉంటే చంద్రబాబు స్పందించిన తీరు మరొక లాగా విరుద్ధంగా ఉండటం ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో మీడియా సమావేశం పెట్టిన టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కావాలని రాజకీయ వేధింపుల వల్ల కోడెల శివప్రసాద్ నీ అంతమొందించారని...ఇది సిగ్గు పడాల్సిన విషయం అని ఏపీ ప్రజలంతా గమనించాలని...చంద్రబాబు కోడెల హత్యని రాజకీయపరంగా చూస్తూ మాట్లాడటం జరిగింది.


అయితే ఇదే క్రమంలో హైదరాబాద్ నగరంలో బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ దగ్గర బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రి కట్టడంలో పెద్ద భూమిక కోడెల పోషించారని ఆయనకు వచ్చిన పదవుల్లో అన్నిటికీ న్యాయం చేస్తూ హుందాగా వ్యవహరించాలని అలాంటి వ్యక్తికి చావు ఉండదని కానీ చనిపోవడం చూస్తే దేవుడు అన్యాయం చేసినట్టుగా ఉందని ఆయన మరణం తీరని లోటని బాలకృష్ణ పేర్కొన్నారు.


మొత్తం మీద బావ బామ్మర్దులు కోడెల మరణం పై స్పందించిన తీరు చూస్తుంటే రాజకీయంగా చంద్రబాబు ఈ హత్యని వాడుకుని...అనగా గతంలో హరికృష్ణ శవం పక్కన పెట్టుకొని చేసిన రాజకీయ ధోరణి ఇప్పుడు మళ్లీ అవలంబిస్తున్నారని చంద్రబాబు కోడెల మరణం పై స్పందించిన తీరు పై కామెంట్లు చేస్తున్నారు చాలామంది. మొత్తం మీద కోడెల మరణంపై బాలకృష్ణ- చంద్రబాబు స్పందించిన తీరు చాలా విరుద్ధంగా ఉన్నాయి చాలామంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: