ఒక నాయకుని మరణం ఎన్ని సంచనాలకు దారితీస్తుందో,ఎన్ని అనుమానాలకు తావిస్తుందో కోడెల మృతిని చూసిన వాళ్ళకు ఇప్పటికే అర్ధం అయ్యుండొచ్చు.ఇక ఈ మరణం అటు ఎందరో నాయకులకు ఇటు పోలీస్ సిబ్బందిని తికమక పెడుతుంది.నిజం బయటకు వచ్చేవరకు పరిస్దితి ఇలాగే వుంటుంది మరి.ఇక ఇప్పటికే కోడెల శివప్రసాదరావు మృతి కేసును సీరియస్‌గా తీసుకుని క్లూస్ టీం,టెక్నీకల్ టీమ్ లు దర్యాప్తు చేస్తున్నాయి.ఇక జూబ్లిహిల్స్‌లోని కోడెల నివాసంలో క్లూస్‌ టీం తనిఖీలు నిర్వహించింది.ఆధారాల కోసం డీసీపీ శ్రీనివాస్‌,టాస్క్‌ఫోర్స్‌ డీసీపీలు కోడెల ఇంటిని పరిశీలించారు.



కోడెల బెడ్‌రూంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం డీసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ శివప్రసాద్‌ ఉదయం తన బెడ్‌రూంలో కిందపడిన స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారన్నారు.కోడెల కిందపడి పోయి ఉంటే భార్య, కుమార్తె, డ్రైవర్‌ కలిసి బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లారని,అక్కడ వైద్యులు కోడెలను బతికించడానికి ప్రయత్నించారన్నారు.కాసేపటి తర్వాత కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు.ఒకవేళ శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకుంటే ఆయన మెడమీద స్వల్ప గాయం ఎలా కనిపిస్తోందన్నారు.ఇంట్లో ఎలాంటి సూసైడ్‌ లేఖలు లభించలేదన్నారు.కోడెల ఇంట్లో ప్రస్తుతం ఆయన భార్య, కుమార్తె, పనిమనిషి మాత్రమే ఉన్నారన్నారు. కోడెల మృతిపై సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేశామన్నారు.కొన్ని రోజులుగా ఆయన ఒత్తిడిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. ఇక 11గంటలకు మాత్రం తన పడక గదిలో విగత జీవిగా పడి ఉన్నారని ఆ దృష్యాన్ని చూసిన భార్య,కుమార్తె, పనిమనిషి ఆస్పత్రికి తీసుకువచ్చారని చెప్పారు.అప్పటికే కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పిన ఈ విషయం ఎన్నో అనుమానాలకు తావిస్తుందంటున్నారు..



ఇక ఇప్పటికే కోడెల మృతి వెనుక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.సోమవారం ఉదయం 11 గంటలకు భార్యతో కలిసి టిఫిన్ చేసిన కోడెల 11-15 గంటలకు మొదటి అంతస్తులోని బెడ్ రూమ్‌కు వెళ్లి డోర్ లాక్ చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ విషయాన్ని గమనించిన భార్య తలుపు తీయమని డోర్‌ను తట్టారు. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో ఆమె గన్‌మెన్‌ను పిలిపించారట.. గన్‌మెన్ బెడ్ రూమ్ వెనుక డోర్ బద్దలుకొట్టి చూడగా అప్పటికే కోడెల ప్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారట.వెంటనే ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారట కాని అప్పటికే ఆయన మరణించారని వారు చెప్పారట ..

మరింత సమాచారం తెలుసుకోండి: