తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ పాతదై పోయిందనీ,ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా లేదనీ అందువల్ల అత్యాధునిక వసతులతో సరికొత్త అసెంబ్లీని నిర్మిస్తామని టీఆర్ఎస్ సర్కార్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే,ఇక ఈ భవనం నిర్మించడానికి ఎర్రమంజిల్‌లోని ప్రాచీన కట్టడాల్ని కూల్చేసేందుకు సిద్దమైంది.సరిగ్గా ఇదే సమయంలో ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.ఎర్రమంజిల్‌లో పురాతన భవనం కూల్చివేయవద్దనీ,అది వారసత్వ కట్టడాల పరిధిలోకి వస్తుందని పిటిషనర్ తరపు లాయర్ నళిన్ కుమార్ కోరారు.హైకోర్టు మాత్రం కొత్త అసెంబ్లీ భవనం ఎందుకు నిర్మించకూడదనని కొత్తగా ఏర్పడిన చాలా రాష్ట్రాలు అసెంబ్లీలు నిర్మించుకున్నాయి కదా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది.దానికి సమాధానంగా కొత్త భవనం నిర్మాణంపై అభ్యంతరం లేదన్న పిటిషనర్...ఇప్పుడు ప్రతిపాదనలో వున్న పాత భవనం వారసత్వ కట్టడం కాబట్టి దాన్ని కూల్చివేయవద్దని కోరగా,అది వారసత్వ కట్టడం కాదని ప్రభుత్వ లాయర్ వాదించారు.



ఇక ఈ విషయంలో కొంత వాదోపవాదనలు నడుస్తున్న నేపధ్యంలో,తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. చారిత్రాత్మక విశిష్టత కలిగిన ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని కొట్టివేసింది.ఎర్రమంజిల్‌ భవనాలను,అలాగే ప్రస్తుత అసెంబ్లీ భవనాలను కూల్చివేయద్దని హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై తీర్పు నిచ్చింది.ఈ విషయంపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఫైనల్ గా ఈరోజు తన తుదితీర్పునిచ్చింది.ఎర్రమంజిల్‌ నిర్మాత నవాబ్‌ సప్దర్‌ జంగ్‌ ముషీరుద్‌ దౌలా ఫక్రుల్‌ ముల్క్‌ వారసులు నూరి ముజఫర్‌ హుస్సేన్‌తో పాటు మరో ఏడుగురు కూడా ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.1870లో 150 గదులతో ఎర్రమంజిల్‌ నిర్మించారని తెలిపారు. ప్రజాప్రయోజనాలకు వినియోగిస్తారనే ఉద్దేశంతో 1951లో ప్రభుత్వానికి అప్పగించామని,చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయాలని మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని వారసులు కోరారు.



ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి ఏం చెయ్యబోతుందో అని ఆసక్తికరంగా మారింది. ఈ తీర్పుని పై కోర్టులో అప్పీల్ చేస్తుందా లేక ప్రత్యామ్న్యాయ మార్గం ఏదైనా అన్వేషిస్తుందా అనేది చూడాలి. కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్ నిర్మించాలనే కల కేసీఆర్ మొదటి టర్మ్ నాటిది. తెలంగాణ చరిత్రపై తనదైన మార్కు ఒకటి ఉండాలి అని అనుకుని కేసీఆర్ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ విషయం అనుకునప్పుడల్లా ఏదో ఒక అవాంతరాలు అడుగడుగునా  ఎదురవుతూనే ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: