జలమండలిలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 159వ జయంతిని పురస్కరించుకొని ఇంజనీర్స్ డేని సెప్టెంబర్ 16.వ తేదీన ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఇంజనీర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జలమండలి ఎండీ ఎం. దానకిషోర్  జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ  సందర్భంగా ఎండీ మాట్లాడారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ఆయన నిర్మించిన ప్రాజెక్టులు ఎన్నో చిరస్మరణీయంగా నిచిపోయాయని అన్నారు.  


జలమండలిలో వినియోగదారులకు అందించే సేవలను మరింత శులభతరం  చేసేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, సరి కొత్త ఆవిష్కరణలను చేపట్టాలని సూచించారని గుర్తు చేశారు. ప్రాజెక్టులు, పనులు ఆలస్యంగా పూర్తవడం వల్ల ఎంతో ప్రజాధనం వృథా అవుతుందని తెలిపారు. జలమండలి రెవెన్యూ పెంచే దిశగా  ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా జలమండలి సంస్థ ఆదాయాన్ని మరింత పెంపొందించే క్రమంలో ఇంజనీర్లు.. రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులు శాయశక్తుల  పాటుపడాలన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు అంకితభావంతో వ్యవహరించాలని ఎండి దన కిషోర్ అన్నారు. . ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.



ప్రముఖ మోటివేట్ స్పీచర్ రమేష్ పార్ధన్ యోగ, ధ్యానం వంటి కార్యక్రమాలను ఈ సందర్బంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఆపరేషన్ డైరెక్టర్లు అజ్మీరా కష్ణ, పి. రవి, ప్రాజెక్టు డైరెక్టర్లు ఎం. ఎల్లాస్వామి, డి. శ్రీధర్ బాబు, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్ లతో పాటు జలమండలి ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్, ప్రదాన కార్యదర్శి హరిశంకర్,  జలమండలి ఇంజనీర్లు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ మోహన్ ప్రభాకరన్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: