తెలంగాణాలో మొన్న జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి తెరాస రెండో సారి   అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసందే. అయితే తెరాస కి ప్రతిపక్షం లేకుండా చేయాలనుకున్న తెరాస... పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లను ఆకర్షించి తెరాస తీర్థం పుచ్చుకునేలా చేసింది .అయితే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది .  అయితే అప్పుడప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకి బలం చేకూర్చాయి .అయితే బీజేపీ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అనుకున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు మాత్రం బీజేపీ తీర్థం పుచ్చుకోలేదు .దీంతో రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో ఎప్పుడు చేరతాడనే దానిపై రాజకీయాల్లో చర్చ జరుగుతుంది .


ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరటం లేదు యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది .నిన్న మొన్నటి వరకు తెలంగాణాలో కాంగ్రెస్ పని అయిపొయింది ...రానున్న ఎన్నికల్లో బీజేపీ దే అధికారం అని చెప్పకనే చెప్పిన రాజ గోపాల్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ దే అధికారం అని వ్యాఖ్యానించాడు .కౌరవులు వంద మంది ఉన్న పాండవులదే గెలుపన్న రాజగోపాల్ రెడ్డి... తాము పాండవులమని వ్యాఖ్యానించాడు . అయితే కలియుగ మహాభారతంలో పదేళ్లు ఇప్పుడు మేము వనవాసంలో ఉన్నామని ..వచ్చే  ఎన్నికల్లో అధికారం తమదేనని తెలిపాడు  .కాగా తమ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్కను శ్రీకృష్ణుడిగా ,శ్రీధర్ బాబును ధర్మరాజుగా, జగ్గారెడ్డిని భీముడిగా, తనను అర్జునుడిగా, సీతక్క, వీరయ్యను నకుల సహదేవులుగా అభివర్ణించారు రాజగోపాల్ రెడ్డి . కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణ విముక్తి పొందిన రోజుని...   తెలంగాణ మూడో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుందని వ్యాఖ్యానించారు.అయితే పార్టీ సీనియర్ నేతలందరూ కలిసి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా మనసు మార్చారా ? లేక ఏదన్న కొత్త ప్లాన్ తో రాజగోపాల్ రెడ్డి ఇలా చేస్తున్నాడా..? అన్నది వేచి చూడాలి మరి 




మరింత సమాచారం తెలుసుకోండి: