ప్ర‌కృతి అందాల‌తో అల‌రారుతున్న న‌ల్ల‌మ‌ల అడ‌వి. ఎటు చూసినా ఎత్తైన ప‌చ్చ‌టి చెట్లు.. గుట్ట‌ల‌తో అల‌రారే అడ‌వి... అడవి జంతువుల అరుపుల‌తో, ప‌క్షుల కిల‌కిల రావాల‌తో ప్ర‌కృతికి చిరునామాగా మారిన న‌ల్ల‌మ‌ల అడ‌వికి ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. ఈ ప్ర‌మాదం నుంచి ప‌చ్చ‌ని అడ‌వి త‌ల్లిని ఎలా కాపాడుకోవాలాలో తెలియ‌ని ప‌రిస్థితిలో సెల‌బ్రెటీలు రంగంలోకి దిగారు.. ప్ర‌కృతితో ప‌ర‌శించిపోయే అడివ‌మ్మ‌ను కాపాడాలి అంటూ సేవ్ న‌ల్ల‌మల అనే ఉద్య‌మానికి పురుడు పోశారు. ఇప్పుడు అంద‌రినోటా ఇదే మాట‌.. సేవ్ న‌ల్ల‌మ‌ల‌.. మ‌రి న‌ల్ల‌మ‌ల‌కు పొంచి ఉన్న ఆ ప్ర‌మాదం ఏంటి.. ఎందుకు సెల‌బ్రెటీలు సేవ్ న‌ల్ల‌మ‌ల అంటున్నారు.. దీనికి ఇప్పుడు ఏకంగా తెలంగాణ స‌ర్కారు కూడా తోడైంది.. అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి...


న‌ల్ల‌మ‌ల అడువులు ప్ర‌కృతికి, ప‌ర్యావ‌ర‌ణానికి అడ్ర‌స్ అయితే   కాపాడుకోవాల‌నే సంక‌ల్పం అంద‌రికి క‌లిగింది. న‌ల్ల‌మ‌ల అడ‌విలో  సుమారు 2000వేల‌కు పైగా ఎక‌రాల్లో జ‌రుగుతున్న యురేనియం త‌వ్వ‌కాల‌తో న‌ల్ల‌మ‌ల నాశనం కానున్న‌ది. అయితే ఈ యురేనియం త‌వ్వ‌కాల‌పై దేశ‌మంతా ప్ర‌ధానంగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ యురేనియం త‌వ్వ‌కాల‌తో అడ‌విని న‌మ్ముకుని బ‌తుకుతున్న అడ‌వి బిడ్డ‌ల బ‌తుకులు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతాయి. అడ‌వి నుంచి అడవిబిడ్డ‌ల‌ను గెంటెస్తారు. దీనికి తోడు ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటుంది. అడ‌వి జంతువులు, ప‌క్షుల ఉనికికే ప్ర‌మాదం పొంచి ఉంది.


యురేనియం త‌వ్వ‌కాల‌తో న‌ల్ల‌మ‌ల అడవంతా విధ్వంసం జ‌ర‌గ‌డం ఖాయం. అందుకే అంత‌టా సేవ్ న‌ల్ల‌మ‌ల అంటూ యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్య‌మ‌మే న‌డుస్తుంది. దీనికి స్పందించిన తెలంగాణ స‌ర్కారు కూడా రంగంలోకి దిగింది. తెలంగాణ అసెంబ్లీలో సేవ్ న‌ల్ల‌మ‌ల‌.. యురేనియం తవ్వ‌కాల‌ను  వ్య‌తిరేకిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప‌రిశ్ర‌మలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యురేనియం త‌వ్వ‌కాల‌ను వ్య‌తిరేకిస్తూ తీర్మాణాన్ని ప్ర‌వేశ‌పెట్టాడు.


ఈ తీర్మాణాన్ని అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. దీంతో న‌ల్ల‌మ‌ల్ల అడవుల్లో జ‌రిగే త‌వ్వ‌కాల‌పై ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న‌నున్న‌ది. ఇప్పుడు తెలంగాణ చేసిన తీర్మాణంతో న‌ల్ల‌మ‌ల అడ‌వికి.. సేవ్ న‌ల్ల‌మ‌ల ఉద్య‌మానికి కొండంత అండ‌గా నిలువ‌నున్న‌ది. ఏదేమైనా ప్ర‌తి ఒక్క‌రి నుంచి ఈ విష‌యంలో వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో కేసీఆర్ స‌ర్కార్ ఎలాంటి వివాదానికి తావులేకుండా వివాదం రాష్ట్ర ప్రభుత్వం కోర్టు బ‌య‌ట‌కు వెళ్లింది.


మరింత సమాచారం తెలుసుకోండి: