ఏపీ మాజీస్పీకర్ కోడెలశివప్రసాదరావు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడన్న విషయం తెలిసిందే.శివప్రసాదరావు కొంతకాలం గా వరుస కేసులతో సతమతమవుతూ, తీవ్ర మనస్థాపం కారణంగానే బలవంతంగా ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోందట.ఇక గత కొద్దిరోజుల క్రితం కోడెల గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరారు.ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కోడెల..మళ్లీ ఈ రకంగా ఆస్పత్రిలో చేరడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.కోడెలతో పాటు ఆయన కుమారుడు, కూతురుపై అనేక కేసులు నమోదు కావడం..ఆయన కుమారుడు కేసుల కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం.ఇక ఎన్నో నాటకీయ పరిణామాల నేపధ్యంలో,పలు అనుమాలతో ఆయన దేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.



ఈ పోస్టుమార్టాన్ని పోలీసులు వీడియో ద్వారా రికార్డు చేసారు.మరోవైపు కోడెల భౌతిక కాయాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, కోడెల చెవుల దగ్గర నుంచి గొంతు వరకు ఉరేసుకున్నట్టు గుర్తులున్నాయని,ఆయన భౌతికకాయంపై ఎలాంటి గాయాలూ లేవని ఈ బృందం స్పష్టం చేసింది.కాగా కోడెల శివప్రసాదరావు పార్థివదేహానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు.ఉస్మానియా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం,కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించారు.ఆయన పార్థివ దేహాన్నిసందర్శించేందుకు టీడీపీ నేతలు,కార్యకర్తలు,కోడెల అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.నందమూరి బాలకృష్ణ,దేవినేని ఉమ,కేఈ కృష్ణమూర్తి తదితరులు నివాళులు అర్పించారు.కాగా,ఈరోజు రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు చేరుకోనున్నారని సమాచారం..



ఇక రేపు ఉదయం స్వగ్రామానికి కోడెల భౌతికకాయాన్ని తరలించనున్నారు.ఇది ఇలా వుండగా కోడెల మృతిపై తెలంగాణ పోలీసుల విచారణ వేగవంతం చేసారు.అందులో భాగంగా కోడెల ఇంటికి మరోసారి వెళ్లారు.కుటుంబసభ్యుల వద్ద బంజారాహిల్స్ ఏసీపీ వివరాలు సేకరించారు.కోడెలది ఆత్మహత్య కాదంటూ తెలంగాణ డీజీపీ,సీపీ హైదరాబాద్, ఏసీపీ బంజారాహిల్స్ కు బురగడ్డ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు.సమగ్ర విచారణ జరిపించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధారాల సేకరణ,ప్రత్యేక్ష సాక్షుల వాంగ్మూ లాలు,ఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్స్​ను క్లూస్ టీం,ఎఫ్ఎస్ఎల్ ఫింగర్ ప్రింట్స్ బృందం సేకరించారు.ఇక అసలు నిజాలు ఎప్పుడు పూర్తిగా బయటపెడతారో అని కార్యకర్తలు,ప్రజలు ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: