మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు మృతిపై టీడీపీ చేసిన వ్యాఖ్య‌ల‌పై అధికార వైసీపీ ఘాటుగా స్పందించింది. అమరావతిలో ప్రభుత్వ చీఫ్ విప్  జి. శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....మాజీ స్పీకర్ కోడెల అకాల మరణం దురదృష్టకరమ‌న్నారు. ఆయన కుటంబ సభ్యలుకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని తెలిపారు. ``కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడనవసరం లేదు..ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం దురదృష్టం...వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదు...`` అని మండిప‌డ్డారు.


సీనియర్ నేత చనిపోయాడు అనే భాద లేకుండా టీడీపీ నాయకులు వైస్సార్సీపీపై బురద జల్లుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్  జి. శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. ``టీడీపీ నేతల విమర్శలు వారి విజ్ఞ‌తకే వదిలేస్తున్నాము...పోస్టుమార్టం రిపోర్ట్ లో వాస్తవాలు తెలుస్తాయి..`` అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 


ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ....కోడెల మరణంపై టీడీపీ నేతలు సిగ్గులేకుండా వైస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారని త‌ప్పుప‌ట్టారు. ``కోడెల మరణానికి ఆయన కుటంబ సభ్యలే కారణమని కోడెల బంధువులు చెపుతున్నారు. టీడీపీ నేతలవి బురద రాజకీయాలు..కోడెలపై ప్రభుత్వ ఎలాంటి తప్పుడు కేసులు పెట్టలేదు...కోడెలపై స్థానిక ప్రజలు పోలీసులు స్టేషన్లలో పిర్యాదు చేశారు. కోడెలను ప్రభుత్వం ఎలాంటి వేదింపులకు గురి చేయలేదు. టీడీపీ నేతలు బుద్ది లేకుండా ప్రభుత్వ హత్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.`` అని వెల్ల‌డించారు.

కాగా, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోర్టుమార్టం పూర్తయింది. సుమారు రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. అక్కడ కోడెల భౌతికకాయానికి పార్టీ నాయకులు నివాళులర్పించనున్నారు. అనంతరం నర్సరావుపేట కండ్లగుంటకు పార్థివదేహాన్ని తరలించనున్నారు. కోడెల శివప్రసాద్‌రావు అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేర‌కు ఏర్పాట్ల‌ను కోడెల స‌న్నిహితులు చేస్తున్ట‌న్లు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: