మొత్తం మీద తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ సభాపతి కోడెల శివప్రసాద్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడ్డారంట. సోమవారం ఈ విషయాన్నీ ఉస్మానియా వైద్య నిపుణులు చేపట్టిన పోస్ట్ మార్టంలో నిర్ధారణ అయింది. ఇప్పటికే కోడెల మరణ పట్ల విభిన్న కధనాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో కధనాలు తెగ వైరల్ అవుతున్నాయి.  ఈ  పరిణామాల నేపథ్యంలో కోడెల మరణంపై పోస్టుమార్టం నివేదిక అసలు విషయాలను బయటపెట్టింది. ఆయనది ఆత్మహత్యేనని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.



శివ ప్రసాద్ మెడ భాగంలో దాదాపుగా  8 అంగుళాల మేర తాడు బిగించుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు గుర్తించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఫొరెన్సిక్‌ వైద్యులు సుమారు రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియోలో రికార్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే గుండెపోటుతోనే కోడెల కన్నుమూసినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా తెలుగు తమ్ముళ్లు కూడా అధికారపక్షమైన  దాడికి తెగపడ్డారు. 




మరోవైపు ఒత్తిళ్ల కారణంగానే కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన అనుచరగణం  చెప్పడం గమనార్హం. మరోవైపు కోడెల గుండెపోటుతోనే ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు ఇప్పటి వరకు చెప్పుకొచ్చాయి. చివరికి డాక్టర్ కోడెల మాత్రం ఉరి వేసుకుని మరి బలవన్మరణం పొందినట్టు పోస్ట్ మార్టం ప్రాధమిక నివేదిక స్పష్టం చేస్తుంది.  ఇదిలా ఉండగా  పోస్ట్ మార్టం అనంతరం కోడెల పార్థివదేహానికి వైద్యులు ఎంబామింగ్‌ చేశారు. ఆ తర్వాత కార్యకర్తల సందర్శనార్థం మృతదేహాన్ని బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు తరలించిన కూడా తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: