మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు చావును కూడా తెలుగు దేశం పార్టీ రాజకీయం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్నటి తెలుగు దేశం చలో ఆత్మకూరు కార్యక్రమం కారణంగా పలనాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉంది. అయితే ఈ విషయాన్ని కోట్ చేస్తూ నారా లోకేశ్ పెట్టి ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే 144 వ సెక్షన్ అమలులో ఉంటే లోకేశ్ మాత్రం.. 144 సెక్షన్ పేరుతో కోడెల అంతిమ యాత్రను అడ్డుకోవడానికి కుట్ర జరుగుతోందని కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు.. కోడెల అంతిమయాత్రను అడ్డుకోవడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని నారా లోకేశ్ ఆరోపించారు.

మాజీ సభాపతి కోడెల శివప్రసాద రావును అక్రమ కేసులతో ప్రభుత్వం వేధించిందని ఆయన అంటున్నారు. నరసరావుపేట డివిజన్ లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ అమలు చేస్తూ విడుదల చేసిన ఉత్తర్వులను ఆయన ట్వటర్ లో జత చేశారు. నారా లోకేశ్ ట్వీట్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఓవైపు టీడీపీ కీలక నేత, మాజీ సభాపతి మరణించిన సమయంలోనైనా నారా లోకేశ్ మానవత్వంతో ఆలోచించకుండా తెలుగు దేశం పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించడం దారుణమని అంటున్నారు. ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంటే.. కొత్తగా 144 సెక్షన్ విధించినట్టు లోకేశ్ చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు.

అయినా కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర జరిగితే దాన్ని ఆపాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు ఉంటుంది. అంతిమ యాత్ర జరిగితే వైసీపీ నేతలకు నష్టమేంటి..? ఈ ప్రశ్నలకు మాత్రం తెలుగు దేశం శ్రేణులను నుంచి సరైన సమాధానం రావడం లేదు. చివరకు కీలకనేత మరణాన్ని కూడా పార్టీని బలోపేతం చేసుకునేందుకు వాడుకుంటున్న తీరు చూస్తుంటే.. ఆశ్చర్యం కలుగకమానదు.


మరింత సమాచారం తెలుసుకోండి: