మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత చంద్రబాబునాయుడు భయపడుతున్నారా ? కోడెల  మృతి తర్వాత చంద్రబాబు చేస్తున్న రాజకీయం చూస్తుంటే అందిరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కోడెల ఆత్మహత్య (హత్య ?)కు తనను ఎక్కడ అందరూ నిందిస్తారో అన్న భయం చంద్రబాబులో పెరిగిపోయిందట. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవటానికి, నెపం తనపై రాకుండా చూసుకోవటంలో భాగంగానే ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నట్లే ఉంది.

 

టిడిపి అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో కోడెల కుటుంబం చేయని అరాచకం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.  కోడెల అధికారాన్ని అడ్డం పెట్టుకుని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలు కేంద్రంగా కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి అనేక అరాచకాలకు పాల్పడ్డారు. అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత వాళ్ళపై నమోదవుతున్న కేసులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

 

వైసిపి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కోడెలతో చంద్రబాబు ఒక్కసారి కూడా మాట్లాడలేదని సమాచారం. కోడెల కుటుంబం వల్ల టిడిపికి బాగా చెడ్డ పేరు వచ్చేసిందన్న భావనలో చంద్రబాబున్నారు. అందుకనే కోడెలతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా దూరం పెట్టేశారు. కోడెల కుటుంబంపై కేసులు నమోదవుతున్నా చంద్రబాబు కానీ టిడిపి నేతలు కానీ ఒక్కళ్ళు కూడా మద్దతుగా నిలవలేదు. చివరకు జిల్లాలోని పార్టీ నేతల్లో చాలామంది తనతో మాట్లాడకుండా దూరంగా ఉండిపోవటాన్ని కోడెల అవమానంగా భావించారు.

 

కోడెలను ఎలాగైనా పార్టీ నుండి బయటకు పంపేయాలన్న ఆలోచన కూడా చంద్రబాబులో ఉండేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో కోడెల మృతికి కుటుంబ సభ్యులు తనపై ఎక్కడ ఆరోపణలు చేస్తారో, పార్టీలో జరిగిన అవమానాలను బయటపెడతారో అన్న భయంతోనే చంద్రబాబు ముందుగానే ఎదురుదాడికి దిగినట్లు అర్ధమవుతోంది. నిజానికి కోడెలతో పాటు కుటుంబసభ్యులపై కేసులు నమోదవుతున్నాయే కానీ ఎవరిని కనీసం విచారణకు కూడా పిలవని విషయం అందిరకీ తెలిసిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: