దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్రుత్తి రిత్యా వైద్యుడు. అంటే ఆయన హ్రుదయం తెరచి  చూసే డాక్టర్.  సర్జరీలు బాగా చేస్తారని పేరు.  దానికి భిన్నమైనది రాజకీయం. అక్కడ మాస్ వేషం కట్టాలి. ఇలా రాజకీయల్లో దూకుడు  చూపించిన కోడెల రెండు భిన్నమైన పాత్రలను తనలోనే ఉంచుకున్నారు. కోడెల ఓ దశలో గుంటూర్ జిల్లా రాజకీయాలను శాసించారనే చెప్పాలి.


అటువంటి  కోడెలకు టీడీపీలో సముచితమైన ప్రాధాన్యత దక్కిందా అంటే ఆలోచించాల్సిందే అంటారు. ఆయన కంటే జూనియర్లు, రాజకీయంగా పెద్దగా బలం లేని వారు అనేకసార్లు మంత్రులు అయినా కోడేల ఫుల్ టెర్మ్ మంత్రిగా చేసింది మాత్రం 1995 నుంచి మాత్రమే. ఆయన 1983లో ఎమ్మెల్యెగా అయినా కూడా మంత్రిగా పనిచేయడానికి నాలుగేళ్ళు ఆగాల్సివచ్చింది. హోం మంత్రిగా కీలకమైన పోర్ట్ ఫోలియో దక్కినా కూడా కోడెల  రంగా హత్య కేసు కారణంగా రాజీనామా చేయాల్సివచ్చింది.


ఇక పదేళ్ల పాటు ఆయన రెండు దఫాలుగా 2004 నుంచి 2014 మధ్యలో ఓడిపోయి రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో టీడీపీ కూడా ఓటమి పాలు అయింది. ఇక 2014లో పార్టీ అధికారంలోకి వచ్చింది. కోడెల కూడా సత్తెనపల్లి నుంచి గెలిచారు. ఆయన మంత్రి పదవి గ్యారంటీ అని ఆశలు పెట్టుకున్నారు. అడిగినట్లుగా కూడా చెబుతారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయన్ని స్పీకర్ గానే కూర్చోబెట్టేశారు. 


విస్తరణలో చాన్స్ ఉంటుందని కోడెల పలుమార్లు ఆశపడినా కూడా అయిదేళ్ళూ ఆయన్ని అధ్యక్ష పీఠంపైన కూర్చోబెట్టేశారు. దాంతో మళ్ళీ మంత్రి అవుదామన్న కోడెల ఆశ తీరలేదు. బాబు కూడా నెరవేర్చలేదు. 2019లో గెలిస్తే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయం అని కోడెల అనుకున్నా పార్టీతో పాటు తానూ ఓడిపోయారు. ఇపుడు జీవితం నుంచే సెలవు తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: