సాధారణంగా బహుళ అంతస్థుల భవనాలకు వెళ్లినపుడు మెట్లు ఎక్కటం కంటే లిఫ్ట్ మార్గాన్నే ఎక్కువగా ఎంచుకుంటాం. కానీ మెట్లు ఎక్కటం, దిగటం వలన మన శరీర ఆరోగ్యానికి మరియు అందానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందువలన మెట్లు ఎక్కే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించాలి. రోజులో కొంత సమయం పాటు మెట్లు ఎక్కేవారిలో దిగేవారిలో గుండెకు సంబంధించిన సమస్యలు తక్కువగా వస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తెలిసింది. 
 
ఒక సర్వే ప్రకారం రెండు వేల మంది యువతులలో మెట్లు ఎక్కే వారిని, మెట్లు ఎక్కని వారిని పరిశీలించినపుడు మెట్లు ఎక్కిన వారిలో గుండె పనీతీరు బాగా ఉన్నట్లు తెలిసింది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా మెట్లు ఎక్కటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన శరీరంలోని కండరాలు మరియు ఎముకలకు మెట్లు ఎక్కటం ఎంతో మేలు చేస్తుంది. మెట్లు ఎక్కటం వలన మోకాళ్లకు కూడా మంచి వ్యాయామం అందించినట్లే అవుతుంది. 
 
కానీ మెట్లు ఎక్కేటపుడు కొంచెం వేగంగా ఎక్కితేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. నిదానంగా మెట్లు ఎక్కటం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. మెట్లు ఎక్కటం వలన శరీరంలోని కేలరీలు వేగంగా కరుగుతాయి. రోజుకు 15 నుండి 20 నిమిషాల సమయం మెట్లు ఎక్కి దిగటం వలన మన శరీరానికి కూడా వ్యాయామం చేసినట్లు ఉంటుంది. మెట్లు ఎక్కి దిగటం వలన బరువు తగ్గి అందంగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. 
 
చాలా మంది బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో ఉపవాసం ఉంటారు. కానీ ఉపవాసం కంటే మెట్లు ఎక్కి దిగటం వలన తక్కువ సమయంలోనే బరువు తగ్గవచ్చు. జాగింగ్, నడక కంటే మెట్లు ఎక్కి దిగటం వలన ఫలితం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజులు మెట్లు ఎక్కి దిగటం అలవాటు చేసుకుంటే బధ్ధకం, అలసట కూడా దూరం అవుతాయి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: