మొన్న జరిగిన ఎన్నికల్లో మరో సారి  అధికారాన్ని చేజిక్కించుకుని భారీ మెజారిటీతో  గెలిచింది టిఆర్ఎస్ పార్టీ...అయితే తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ...ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని అంటుంటారు . అయితే తెరాస గురుంచి అందరికి పాజిటివ్ ఒపీనియన్ ఉందా అంటే అలా ఏం లేదు . తెరాస పై నెగిటివ్ టాక్ కూడా ఎక్కువగానే ఉంది . తెరాస అధినేత సీఎం కేసీఆర్ ఎప్పుడు   సెక్రటేరియట్‌కి రారని , అయన ఫామ్‌హౌస్‌లోనో, లేక ప్రగతి భవన్ లోనో ఉంటారు తప్ప ...సెక్రటేరియట్‌కి రావటం చాల తక్కువ అని చెబుతుంటారు .


అయితే మొన్నటి వరకు ఏం చేసిన సున్నితంగా తన పని తాను చేసుకుంటూ కేసీఆర్ చూపించిన దగ్గర  సంతకాలు చేసుకుంటూ పోయారు .అయితే కేంద్రం తెలంగాణకు కొత్త గవర్నర్ గా తమిళిసై సౌందర్యరాజన్  ను నియమించిన  నేపథ్యంలో కొత్త గవర్నర్ తో కేసీఆర్ కి చిక్కులు తప్పవు అని భావించారు . అయితే అందరు అనుకున్నట్టుగానే జరిగేట్టుంది పరిస్థితి . 


కెసిఆర్ సెక్రటేరియట్‌ లో ప్రజలకి అందుబాటులో ఉండటం లేదని గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ రావటం తో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారట గవర్నర్. అయితే దీనిపై ఓ రాజకీయ ఎత్తుగడ వేశారు గవర్నర్ . గవర్నర్ డైరెక్ట్ గా  ప్రజాదర్బార్ నిర్వహించుకోవాలని అనుకుంటున్నట్టు కాకుండా ...  MBT నేత అమ్జదుల్లాఖాన్... ప్రజాదర్బార్ నిర్వహించాలని గవర్నర్ ని  ట్వీట్ ద్వారా కోరగా... తమిళసై సౌందర్యరాజన్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది .గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే రాజభవన్ లో ప్రజాదర్బార్ కి నిర్ణయం తీసుకున్న గవర్నర్ ... భవిష్యత్తులో ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని అనుకుంటున్నారు అంత


మరింత సమాచారం తెలుసుకోండి: