ఆరోజుల్లో బానిసత్వము అనే పదము బడాగ్నిలాగా మారి సలసల కాగుతూ సంకెళ్లను తెంచుకుని నిజాం పాలనను తుత్తు నియమాలు లేకుండా చేసింది.ఈ ఉద్యమంలో అసువులు బాసిన గుండెలెన్నో ఉన్నాయి అవి చివరి వరకు కూడా స్వేచ్చ కోసం తపించాయి.చొక్కాకున్న ఒక్క గుండి తెగితే మరోగుండి వేస్తాము,కాని ఈ ఉద్యమము కోసం ఎన్ని గుండెలు తెగిపడ్డాయో. ఎన్ని ఊపిరిలు వేడివేడి శ్వాసలు వదిలాయో.లెక్కలేదు.బాధలనుభవించే ప్రతి బిడ్డల కన్నీళ్లు ఎన్ని సముద్రాలుగా మారాయో.నిజాం పాలకుల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు నానా కష్టాలు పడ్డారు.స్వాతంత్రం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ,తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు.ఒంటిమీద గుడ్డలు లేవు,కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు.



ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది.ఆదివాసీలు ఏకమై ఎదురు తిరిగారు.ఎంతో మంది ఉద్యమ నేతలు,కళాకారులు.అందరూ తమ ప్రాణాలు పణంగా పెట్టారు.తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులు,స్త్రీలు,పిల్లలు అనే తేడాలు లేకుండా తుపాకులు,బడిసెలు పట్టి రజాకార్ల మూకలను తరిమికొట్టారు.అప్పుడు వచ్చిన ఆ ఉప్పెనతో కాని తెలంగాణ ప్రజలకు విముక్తి కలుగలేదు...ఉద్యమం అత్యంత తీవ్ర స్థితికి చేరిన తర్వాత.కేంద్ర ప్రభుత్వం అలర్టైంది.ఏం చేసైనా నిజాం సంస్థాన్ని ఇండియాలో కలిపేయమని సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కి సూచించింది.అంతే,భారత సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. దాంతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు.ఇక లొంగిపోక తప్పదని అర్థమైంది.1948 సెప్టెంబర్ 17.న ఈ శుభవార్తని హైదరాబాద్ రేడియో ద్వారా,నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించారు..



ఇక శాంతి కపోతం ఆకాశంలో స్వేచ్చగా విహరించినట్లుగా,ఆడ,మగా, చిన్న,పెద్ద అనే తేడాలేకుండా ఒంటిమీద,గుండెమీద అయిన గాయాలను మరచి నీ బాంచన్ కాల్మొక్తా అనే బ్రతుకుల్ని వదిలి స్వేచ్చగా జీవించడం మొదలు పెట్టారు..1947 ఆగస్ట్ 15న మన దేశానికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది కాని తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం లభించలేదు.ఎందుకంటే అప్పటి నైజాం సంస్థానంలో నిజాం పాలకుల ప్రజలకు ఇంకా విముక్తి లభించలేదు.కాబట్టి తెలంగాణ ప్రజలకు అసలైన స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17 లభించనట్లే..ఆ నాడు వారు సాధించిన ఈ తెలంగాణ విమోచన దినోత్సవం బీడికాల్చినంత తేలిగ్గా,పదవులు అధిరోహించినంత అలుకగా వచ్చింది కాదు,ప్రతి బిడ్డ మాన,ప్రాణాలతో సాధించుకుని, రజాకారుల అకృత్యాల నుండి విముక్తిని పొందింది.అందుకే ఇదే రోజును తెలంగాణ ప్రజలు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.ఇక నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరుపెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: