అన్న చెల్లాల ప్రేమ వర్ణనాతీతం. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు .. దేవుడా ఎందుకయ్యా నాకు ఈ అన్నని ఇచ్చావు అని చెల్లి అంటే .. ఈ రక్షేశిని నాకు ఎందుకు ఇచ్చావు అని అన్న అంటదు. ఆలా రోజు టామ్ అండ్ జెర్రీ గొడవలు మామూలుగానే ఉంటాయి. కానీ ఒక్కసారి అన్న చెల్లలు దూరమైయ్యారంటే ప్రేమ పొంగిపోతుంటుంది. అప్పుడే తెలుస్తుంది అందరికి అన్న చెల్లెళ్ళ ప్రేమ. 


కానీ ఈ నాలుగేళ్ళ బుడతడి మాత్రం చిన్నప్పుడే ఆ ప్రేమ గురించి తెలిసినట్టుంది. అందుకే నాలుగేళ్ళ వయసులోనే చెల్లి కోసం గెరిట పట్టాడు వంట చేశాడు. వివరాల్లోకి వెళ్తే ఓ బుడతడు తన చెల్లి కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఆమెకు తినిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తం వంట అంత కూడా ఎడమ చేత్తో చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. 


ఏ ఒక్కరి సహాయం లేకుండా పాన్ లో నూనె వేసి ఎగ్స్ వేసి బాగా వేగిన తర్వాత కూరగాయలు, మసాలాలు, ఉప్పు కారం వేసి బాగా చేసి తర్వాత దానిపై కొత్తిమీర వేసి వంట పూర్తి చేశాడు. ఆతర్వాత వంటని రెండు బౌల్స్ సెర్ప్ చేసి తన చెల్లికి నీట్ గా తినిపించాడు. ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు ఎంత అందమైన ప్రేమ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు కామెంట్ పెడుతూ వాళ్ళ అన్నని వంట చెయ్యమంటే కిచెన్ ని పేల్చేసి వస్తాడు అంటూ నవ్వుతు కామెంట్లు పెడుతున్నారు. చెల్లి కోసం బుడతడు వంట చేసిన వీడియోని మీరు ఓ లుక్ ఏసుకోండి.     


మరింత సమాచారం తెలుసుకోండి: