కోడెల నియోజకవర్గాల్లోని ఆయన  బాధితుల పెద్దఎత్తున ఫిర్యాదులు చేసినప్పుడు.. అలాగే  అసెంబ్లీ నుంచి ఫర్నిచర్‌ తరలించారని  కోడెల పై    ఆరోణపణలు వచ్చినప్పుడు  ప్రతిపక్ష నేత చంద్రబాబు  నోరు మెదపలేదు. కోడెల నిజాయితీ పరుడని బాబు బలంగా వాదించలేదు, కనీసం కోడెలకు మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు.  కానీ చంద్రబాబు  నేడు.. వైసీపీ  రాజకీయ వేధింపుల వల్లే కోడెల మృతి చెందినట్లు ఆరోపణలకు దిగుతున్నారు.   చంద్రబాబు, టీడీపీ నేతలు కోడెల మృతి చెందగానే వెంటనే రంగంలోకి దిగి రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయడం నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది. అన్నట్లు నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..  ఐపీసీ 420 కింద కేసులున్న ప్రబుద్ధులు అలాంటి పనులే చేస్తారని పెద్దలంటుంటారు. జగన్ గారు!  కోడెలగారి విషయంలో కూడా మీరు అదే చేశారు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా కోడెలగారు హుందాగా వ్యవహరించి మీ స్పీకర్ గారికి లేఖ కూడా రాశారు. ఆయన కూడా అందిందని సంతకం చేశారు. అలాంటప్పుడు కేసులెలా పెడతారు?  ఇదంతా మీరు, మీ శకునిమామ విజయ్ సాయి రెడ్డితో  కలిసి కోడెల గారిని మానసికంగా దెబ్బతీసేందుకు, సమాజంలో వారికున్న మంచిపేరును చెడగొట్టేందుకు పన్నిన కుట్ర కాదా? మీరు దొంగలు అయినంత మాత్రాన అందరూ అలాంటివారి అనుకుంటే అంతకంటే నీచమైన ఆలోచన ఇంకొకటి ఉండదు. అని పోస్ట్ చేసారు. 


అలాగే  చంద్రబాబు కూడా ట్వీట్ చేస్తూ.. ‘కోడెలను కడసారి చూసుకోడానికి కూడా వీలు లేకుండా ఆయన అభిమానులను ఇబ్బంది పెట్టడానికి నరసరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ పెట్టింది ప్రభుత్వం. అంతేకాదు 30 పోలీస్ యాక్ట్‌ను కూడా అమలుచేస్తున్నారు. 'ఒకవైపు కోడెల అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టి, మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటున్నారు. ఇదంతా తమ దుశ్చర్యలను కప్పిపుచ్చుకోడానికే.  వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలకు ఈ ప్రభుత్వ నిజస్వరూపం తెలిసింది. అని బాబు పోస్ట్ చేశారు.  వీళ్ళ ఆరోపణలు ఇలా ఉంటే కోడెల మృతి పై ఇప్పటికే చాల అనుమానులు వ్యక్తమవుతున్నాయి. గుండెపోటు వస్తే.. క్యాన్సర్ హాస్పిటల్ కి ఎందుకు తీసుకువెళ్లారు. అసలు ఆయన ఇంట్లో మరణించిన రాత్రి జరిగిన సంఘటనలు ఏమిటి ?  ఇవ్వన్నీ విచారించాల్సిన అవసరం ఉంది.          


మరింత సమాచారం తెలుసుకోండి: