మొబైల్ ఫోన్ ఇప్పడు ప్రతిఒక్కరి చేతిలో కంపల్సరీ ఉండాలి. ఫోన్ లేదు అంటే జీవితాన్ని పోగుట్టుకున్నట్టు ఫీల్ అవుతారు ప్రస్తుతం ప్రజలు. అయితే అలాంటి ఫోన్ల కోసం కొందరు వారి సాలరీస్ అంత ఇచ్చి కొంటారు. మరికొంతమంది మొబైల్ పిచ్చి ఉన్నవాళ్లు ఫోన్లను ఈఎంఐ కట్టి మరి ఫోన్లను కొంటారు. కానీ అవి అనుకోని రీతిలో పోగొట్టుకుపోతాయి. మరికొంతమంది కావాలని ఫోన్లను దొంగిలిస్తారు. 


అలా చోరీకి గురైన ఫోన్లను, పోగొట్టుకున్న ఫోన్ల ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. ప్రభుత్వరంగా టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో పైలట్‌ ప్రాజెక్టుగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చుట్టింది. చోరీకి గురైన ఫోన్లను, పోగొట్టుకున్న మొబైల్స్ రిపోర్టింగ్ కోసం కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ www.ceir.gov.in అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు.


 సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పేరుతో మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా బిఎస్‌ఎన్‌ఎల్ సహకారంతో ప్రారంభించారు. రీగ్రామింగ్‌తో సహా భద్రత, దొంగతనం, ఇతర సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టారు. పోగొట్టుకొన్న లేక ఎవరైనా తీసుకున్న ఆ ఫోన్ లను అన్ని నెట్ వర్కులతో బ్లక్ చెయ్యడం, ఫోన్లో వినియోగదారుడికి సంబందించిన డేటాను మొత్తం తీసెయ్యడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్షణాలు. 


కాగా మీ ఫోన్ ఎలా పోయిన కేసు పెట్టాలనుకుంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆపై 14422 హెల్ప్‌లైన్ ద్వారా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కి తెలియజేయాలి. దీంతో వెంటనే మీ ఫోన్‌ లో డేటాను బ్లాక్‌ చేస్తుంది. కాగా ఆ ఫోన్ ఎవరు వినియోగించాలని చుసిన డేటా సమాచారం అందిస్తుంది. కాగా భవిష్యేత్తులో కూడా ఆ ఫోన్ ని ఎవరు ఉపయోగించకుండా చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: