టీడీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని అధోస్థితిలోకి తీసుకెళ్తున్నాయి. టీడీపీ పార్టీ నేతల పార్టీ మారటాలు .. కొంత మంది ముఖ్య నేతలు జగన్ గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఇవన్నీ చూస్తుంటే .. టీడీపీ నేతల్లో జగన్ ఫోబియా క్లియర్ గా కనిపిస్తుంది. జగన్ అధికారంలోకి రాగానే అప్పటి వరకు పులులు మాదిరి బతికిన కొంత మంది టీడీపీ కీలక నేతలు ఓడిపోయి ఇప్పుడు జగన్ ను విమర్శించే ధైర్యం కూడా సరిపోవటం లేదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు చీటికీ మాటికి మీడియా ముందుకు వచ్చి స్థాయి లేనటువంటి నేతలు కూడా విమర్శించిన రోజులు ఉన్నాయి. కానీ కాలం ఎప్పుడు ఒకే రీతిలో ఉండదు కదా !


ఇప్పుడు జగన్ ఏపీకి ముఖ్యమంత్రి. జగన్ ను గట్టిగా విమర్శిస్తే టీడీపీ నేతలకు కష్టాలు తప్పవని తెలుసు. అందుకే కామ్ గా ఎవరి పని వారు చూసుకుంటున్నారు. లేని పోనీ సమస్యలు ఎందుకన్నట్టు ఉంది ఇప్పుడు టీడీపీ నేతల పరిస్థితి. దీనితో ఏపీలో ప్రతి పక్షం ఉన్నా నామమాత్రంగా ఉందని చెప్పాలి. ఒక్క చంద్రబాబు ..లోకేష్ తప్పితే ఎవరు టీడీపీలో నోరు విప్పలేని పరిస్థితి. దీనితో జగన్ భయం వారినెంతగా పట్టుకుందో అర్ధం అవుతుంది.


అయితే కొన్ని రోజుల నుంచి గమనిస్తే టీడీపీ పెద్ద నాయకులూ .. కీలక నేతలు జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు .. కర్నూల్ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ జగన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అనంతపురం బాద్ షా అని చెప్పుకునే జేసి జగన్ మా వాడే అంటూ వెనకేసుకొని వస్తున్నారు. ఇదంతా చూస్తుంటే టీడీపీలో ఇక భవిష్యత్ లేదు వైసీపీ అండతో రాజకీయాల్లో ఉండాలని వీరందరూ భావిస్తునట్టున్నారు. అందుకే జగన్ మీద పొగడ్తలు కురిపిస్తూ తెగ ప్రేమను చూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: