వచ్చే ఏడాది నాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాయలసీమలో కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ సమావేశంలో భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి  జగన్ మాట్లాడుతూ..భారీ వర్షాల కారణంగా కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లని ఆదేశించారు. ఈ మేరకు ఆయా కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినట్టు సమాచారం. 



రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపైన కూడా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఇసుక అంశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇసుక అక్రమ తవ్వకాలను అరికతే క్రమంలో కోట మేర కొరత ఏర్పడింది. ఈ పరిణాలమాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సమావేశానికి హాజరైన అధికారులు  వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా వరద ప్రవాహం ఉందని పేర్కొంటూ ప్రస్తుత ఆయా నదుల పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. వరద తగ్గిన వెంటనే ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.





వరదలు తగ్గిన తర్వాత వీలైనంత ఇసుకను స్టాక్‌ యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతాయి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. డిసెంబర్‌ నుంచి కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు ఇస్తామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే ఉండాలని, రేషన్‌కార్డులు, పెన్షన్లు ఉన్నవారి జాబితా బోర్డులో పెట్టాలన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: