ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కోడెల ఆత్మహత్య వేడెక్కించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల యుధ్దాలతో రాష్ట్రం దద్దరిల్లిపోతోంది. నిజానికి కోడెల శివప్రసాదరావు కంటే ఆయన కుటుంబంపైనే ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నీచర్, కే ట్యాక్స్.. వంటి అంశాలు ఆయన్ను చుట్టుముట్టాయి. అయితే.. వీటిపై కోడెల ఆత్మహత్యకు ముందు వరకూ టీడీపీ నుంచి చంద్రబాబుతో సహా ఎవరూ పెద్దగా  మాట్లాడలేదు.

 


చంద్రబాబు గుంటూరులో మాట్లాడుతూ.. కోడెలది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య అన్నారు. లక్ష రూపాయల ఫర్నీచర్ కోసం కోడెలను మానసికంగా హింసించారని, దీని కోసం ఇంత హింసిస్తారా అని అంటున్నారు. పుష్కరాలపై కాదు గోదావరి బోటు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేయాలి అంటున్నారు. చంద్రబాబు గమనించాల్సింది ఏమంటే.. పుష్కరాల్లో రాజమండ్రిలో మొదటి రోజు 29 మంది, గతేడాది గోదావరిలో వాడపల్లి దుర్ఘటనలో 20 మందికి పైగా, విజయవాడ ఫెర్రీ దుర్ఘటనలో 25 మందికి పైగా చనిపోయింది ఆయన హయాంలోనే. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వాటిని మర్చిపోయి ఇప్పుడు ఈ ప్రమాదంపై మాత్రం సీబీఐ ఎంక్వైరీ.. అంటున్నారు. ప్రభుత్వ సొత్తు విషయంలో ఈ పని ఎవరు చేసినా తప్పే అవుతుంది. గోదవరి పుష్కరాల తర్వాతే వాడపలి, దీని తర్వాతే విజయవాడ ఫెర్రీ దుర్ఘటన.. అన్నీ టీడీపీ హయాంలోనే జరిగాయి.

 


నిజానికి అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో టీడీపీ నుంచి గానీ, చంద్రబాబు నుంచి కానీ కోడెలకు ఎటువంటి సానుభూతి అందలేదు. ఈ ఆరోపణల్లో నిజముంటే కోడెలపై చర్యలు తీసుకోండి అని చంద్రబాబే అన్నారని వార్తలు వచ్చాయి. కోడెల మృతి తర్వాత బాబు వేస్తున్న ప్రశ్నలు ఆయన ఉన్నప్పుడు మాత్రం వేయలేదనేది గమనించాల్సిన అంశం. మరి.. ఈ అంశంపై ఇంకెన్ని వాదోపవాదాలు జరుగుతాయో.. మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: