ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా సీ.......నియర్ నాయకుడు.. ఎన్టీఆర్ హయాం నుంచి కీలకపాత్ర పోషించినాడు.. చాలా పెద్ద మనిషి.. అందులోనూ రాజుల కుటుంబం నుంచి వచ్చినవారు.. చాలాసార్లు రాష్ట్రమంత్రిగా పనిచేశారు. మొన్న నరేంద్ర మోడీ సర్కారులో కేంద్ర విమానయానశాఖ మంత్రిగానూ పనిచేశారు.. ఆయనే అశోక్ గజపతి రాజు.


కానీ అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత రాజుగారి జాడ కనిపించడం లేదు. పెద్దగా పార్టీ వ్యవహారాల్లోనూ పాల్గొనడం లేదు. మొన్న పార్టీ పిలుపు ఇచ్చిన చలో ఆత్మకూరులో కూడా ఆయన కనిపించలేదు. తెలుగు దేశం నాయకులు అంటేనే మీడియా పులులు అన్న పేరున్నా.. అశోక్ గజపతి రాజు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.


ఆయన కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఆయన నిస్తేజంపై తెలుగు దేశం శ్రేయోభిలాషులు బాధపడుతున్నారు. ఎల్లో మీడియాకు కరపత్రికగా భావించే ఓ పత్రికలో దీనిపై ఓ కథనం వచ్చింది. అందులో అశోక్‌ గజపతిరాజు తీరును విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉన్నన్నాళ్లు.. "అయామ్ సెంట్రల్'' అంటూ ఆయన పార్టీకి దూరంగా ఉన్నారని ఆ కథనంలో బాధపడ్డారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేశారట.


అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. అశోక్ గజపతి .. అదే తీరుని కొనసాగిస్తున్నారన్నది తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుండి ప్రజలకే కాదు.. పార్టీ కార్యకలాపాలకు కూడా తన అనారోగ్య కారణాల రీత్యా పూర్తిగా దూరంగా ఉంటున్నారట.మౌనమే నీ భాష ఓ మూగమనసా అన్నట్లుగా ఉందట అశోక్‌ వ్యవహార శైలి. అశోక్ గజపతి రాజు ఒక్కడే కాదు.. అరకు ఎంపీగా పోటీచేసిన వైరిచర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణదేవ్ కూడా సేమ్.. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఎక్కడున్నారన్నది కార్యకర్తలకే కాదు.. పార్టీ నాయకులకు కూడా తెలియదట!.. అధికార పార్టీగా ఉన్నన్నాళ్లూ హడావిడి చేసిన ఈ నేతలు ఇప్పుడు టీడీపీ దుస్థితి చూసి సైలైంటైపోయినట్టున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: