నెల్లూరు నారాయణ .. ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఆర్ధికంగా వెన్ను దన్నుగా నిలిచారు. అయితే ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి నారాయణను కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికే పలు టీడీపీ నేతల మీద కేసులు బుక్ అయినాయి. నెక్స్ట్ నారాయణేనని బలంగా వినిపిస్తుంది. అయితే నారాయణ తన వ్యాపారాలను కాపాడుకోవటానికి వైసీపీలో చేరడానికి గట్టిగా ప్రయత్నం అయితే చేసారు. కానీ కుదరలేదు. నెల్లూరులో నారాయణ మీద పోటీ చేసి స్వల్ప తేడాతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచిన సంగతీ తెలిసిందే. అయితే ఎన్నికలప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ను ఓడించడానికి నారాయణ కొన్ని కుటీల రాజకీయాలు కూడా చేశారు. అనిల్ మీద ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి మీడియాకు వదిలారు.


అయితే ఎన్నికల్లో నారాయణ ఓడిపోయిన తరువాత వైసీపీలోకి రావటానికి తెగ ప్రయత్నించారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ ..  నారాయణను పార్టీలోకి రాకుండా చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనితో నారాయణ చేసేదేమి లేక సైలెంట్ అయిపోయారు.  నెల్లూరు నారాయణ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తరువాత ఆ స్థాయిలో అధికారాన్ని చలాయించారు. కానీ అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు కదా ! ఇప్పుడు టీడీపీ ఓటమి నారాయణను బాగా కుంగదీసినట్టుంది. కనీసం మీడియా ముందుకు కూడా రావటం లేదు.


నెల్లూరు స్థానం నుంచి పోటీ చేసి కూడా నారాయణ ఓడిపోవటంతో పరువు కూడా పోయింది. నెల్లూరులో  నారాయణ అభివృద్ధి కొద్దో గొప్ప చేసినా  .. డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లినా గెల్వలేకపోయారు. మీడియా ముందుకు కూడా నారాయణ రాలేకపోతున్నారు. రాజధాని వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే నానా హంగామా చేస్తుంది. కానీ టీడీపీ పార్టీలో రాజధాని కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన నారాయణ మాత్రం నోరు మెదపటం లేదు. వైసీపీలోకి నారాయణను చేర్చుకుంటే పార్టీలోని కార్యకర్తలకు తప్పుడు సిగ్నల్ పంపిచ్చినట్లు అవుతుందని జగన్ కు అనిల్ చెప్పినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: