మార్కెట్లోకి ఏ కొత్త క్రీం వచ్చిన కొనేసి తెగ వాడేస్తుంటారు కొందరు అతివలు.వాళ్ల అందం మీద వారికున్న శ్రద్ధ అలాంటిది. దాన్ని క్యాష్ చేసుకుంటూ యాడ్స్ కూడా అలానే చూపిస్తారు.అందమీద మోహం వుండాలి కాని అతి మోహం వల్ల ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది.ఇలానే జరిగింది ఓ మహిళకు.ఫేస్ క్రీమ్ రాసుకోగానే ఆ మహిళ కోమాలోకి జారుకుంది.ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది.అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.47 ఏళ్ల ఓ మహిళ చర్మంపై మచ్చలు,ముడతలు తొలగించే ఫేస్‌ క్రీమ్‌ను ఆర్డర్ చేసింది.దాన్ని ముఖానికి రాసుకోగానే అస్వస్థతకు గురైంది.వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌లో చేర్చారు.ఆమె రాసుకున్న ఫేస్‌ క్రీమ్‌ను కూడా వెంట తీసుకెళ్లారు.ఆ క్రీమ్‌ను పరిశీలించిన వైద్యులు,అందులో మేతేల్మెర్క్యూరీ,అనే రసాయనం కలిసిందని. సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ ప్రెవెంక్షన్ తెలిపిన వివరాల ప్రకారం.



ఈ రసాయనంవల్ల నరాల వ్యవస్థ దెబ్బతిని,బాధితులు సెరెబ్రల్ పాల్సె అని పిలవబడే మస్తిష్కపక్షవాతంకు గురవ్వుతారన్నా రు.ఇక ఇలాంటి ఫేస్ క్రీమ్‌ వల్లశరీరం విషతుల్యం కావడం చాలా అరుదని,ఇలాంటి కేసును తొలిసారి చూస్తున్నామని వైద్యులు తెలిపారు.ఈ సంఘటన పై ఆమె కొడుకు మాట్లాడుతూ.తక్కువ ధరకు ఫేస్ క్రీమ్ లభిస్తుందనే కారణంతో ఆమె మెక్సికో నుంచి ఆర్డర్ చేసింది.ఈ ఫే‌స్ క్రీమ్ ఉపయోగించిన కొన్ని గంటల తర్వాత అమ్మ అస్వస్థతకు గురికావడంతో,ఆమెను హాస్పిటల్‌లో చేర్చగా,కొద్ది రోజుల తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది.వైద్యులు అమ్మ ఉపయోగించిన కాస్మోటిక్స్‌ను పరిశీలించాగా ఆ ఫేస్ క్రీమ్‌లో మెర్క్యూరీ శాతం ఎక్కువగా ఉందని,అది కల్తీ ప్రొడక్ట్ అని తేలిందని పేర్కొన్నాడు..



ఈ ఘటన జరిగి చాలరోజులవుతున్న ఇప్పటికీ ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది.ఇక ఈ ఘటనపై కాలిఫోర్నియా పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఒలివియా కాసిరే మాట్లాడుతూ.ఇతర ప్రాంతాల నుంచి ఫేస్‌ క్రీమ్‌లు తదితర కాస్మోటిక్‌లను దిగుమతి చేసుకోవడం మంచిది కాదు.ముఖ్యంగా మెక్సికోలో ఎక్కువగా కల్తీలు జరుగుతున్నాయని, అందువల్ల చాలా జాగ్రత్తగా
వుండాలన్నారు.ఈ రసాయనం నరాల్లోకి చాలా సులభంగా చేరుడం వల్ల,కుంగుబాటు,నిద్రలేమి,తలనొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం,ఆత్రుత,ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఇంతేకాకుండా ఇది గర్భిణీ స్త్రీలకు మరింత ప్రమాదకరం అని సూచించారు..చూసారుగా తక్కువధరకు వస్తుందని ఆశపడితే చివరకు ఆ ఆశ ఎంతకు దారితీసిందో అందుకే కల్తీ సరకుల విషయంలో ఆచితూచీ అడుగెయ్యాలంటున్నారు ఈ సంఘటన తెలిసిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: