రాజకీయాల్లో ఎప్పుడు ఏవింత ఎందుకు జరుగుతుందో చెప్పలేం.తీవ్రంగా దూషించుకున్న వారు శత్రువులు కావచ్చూ,కలసి వున్న మిత్రులు సడెన్‌గా ప్రతిపక్షాల్లా మారి రాళ్లు విసురుకోవచ్చూ అదే వింత ఇప్పుడు జరిగింది.గత కొన్ని సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వానికి,మమతా బెనర్జీకి మధ్య అనేక అంశాల్లో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఉప్పు-నిప్పులా చిటపటలాడే వారు ఇద్దరు.ఇది ఇంతటితో ఆగకుండా లోక్ సభ ఎన్నికల్లో ఈ వైరం పతాక స్థాయికి చేరుకుంది.ఇప్పటికి అక్కడక్కడ రాష్ట్రంలో అటు బీజేపీ, ఇటు తృణమూల్ నేతల మధ్య వీధిపోరాటాలు జరుగుతున్నాయని వింటున్నాం.ఇక మోదీ అంటేనే ఇంతెత్తున ఎగిరిపడే మమతా బెనర్జీ,ఈ రోజు అంటే బుధవారం ఢిల్లీ వెళ్లి.ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారట.



ఐతే,ఇది మర్యాదపూర్వక భేటీ అని ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని,రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధుల విడుదలతో పాటు రాష్ట్రం పేరు మార్పుపై ప్రధానితో చర్చించడానికే వెళ్లుతున్నానని ఆమె చెప్పారు.కాని కొందరు మాత్రం ఈ మీటింగ్ వెనకా ఓ కధ వుందని అదేంటంటే శారదా స్కామ్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ పీకల్లోతు కూరుకుపోయిందట.టీఎంసీకి చెందిన చోటా మోటా నాయకులు కేసుల్లో ఇరుక్కుని ఎంతో ఇబ్బందులు పడుతున్నారట.ఈ సందర్భంలో తాజాగా కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ టార్గెట్ చేసింది.ఆయన్ను అరెస్టు చేసి ప్రశ్నిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీబీఐ చెబుతున్న ఈ నేపథ్యంలో మోదీతో మమత మీటింగ్ ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది..



మోదీ రెండో దఫా చేస్తున్న ప్రమాణస్వీకారానికి మమత గైర్హాజరవడంతో పాటు,నీతి అయోగ్ భేటీకి డుమ్మా కొట్టడమే కాకుండా ఈ మధ్య చంద్రయాన్-2 ప్రయోగం విఫలం చెందిన సందర్భంగా కూడా ప్రధాని మోదీపై ఎన్నో విమర్శలు గుప్పించారు.అవన్ని మరచిన మమత ఇప్పటికిప్పుడు మోదీకి బర్త్ డే విషెస్ తెలపడంతో పాటు ప్రత్యేకంగా కలవనుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఏది ఏమైనా వీరిద్దరు భేటీ కానున్న నేపధ్యంలో ఎన్నో అవాక్కులు చవాక్కులు పేలుస్తున్నారు కొందరు.శారదా చిట్ ఫండ్ కేసుతో పాటు..మరిన్నికేసుల్లో కూడా మమత ఇరుక్కున్నారని..అయితే తనను తాను రక్షించు కునేందుకే మోదీ వద్దకు బేరానికి వెళుతున్నారంటూ గుసగుస లాడుతున్నారు.ఎవ్వరు ఏమనుకున్న అవన్ని పట్టించుకోకుండా రాజకీయాల్లో ఇవన్ని సాధారణమే అన్నట్లుగా మోదీతో,దీదీ భేటీకి సిద్దమైందట...

మరింత సమాచారం తెలుసుకోండి: