మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాద రావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అయనకుటుంబసభ్యులు నిరాకరించినట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల చనిపోయారని కుటుంబసభ్యుల ఆరోపించారు. అధికారిక లాంఛనాలు వద్దని కోడెల కుటుంబసభ్యులు సన్నిహితులకు తెలిపారని విశ్వనీయ సమాచారం.ఈ  ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల వలనే తమ కుటుంబ పెద్దను కోల్పోయామని కోడెల బంధువర్గం సైతం ఆరోపించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ స్పష్టం చేశారు.



కోడెల అంత్యక్రియలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు నరసరావుపేటలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే  గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 700 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోడెల  దహన సంస్కరాలకు హాజరయ్యే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.కోడెల మీద జగన్ ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడిందని టిడిపి నేత  జి వి ఆంజనేయులు ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన హత్యగా పరిగణించాలన్నారు. దీనికి జగన్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.




కోడెల అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు వద్దని వారి కుటుంబ సభ్యులు తిరస్కరించారని చెప్పారు. కుటుంబ సభ్యులు వారి కార్యకర్తలు, ప్రజల తోటి  కలిసి అంత్యక్రియలు చేసుకుంటామని స్పష్టం చేశారని  ఆంజనేయులు పేర్కొన్నారు. మరో పక్క  కోడెల హఠాన్మరణం వెనుక గల అసలు కారణాలను వెలికి తీయడానికి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బీజేపీ నేత పురిఘళ్ల రఘురామ్ డిమాండ్ చేయడంతో రాజకీయం మహా రంజుగా తయారైదనే చెప్పాలి. ఈ దిశగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరడం ఎంతో ప్రాధాన్యతను సంతరినుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: