మౌనం అన్నిటికన్నా భయంకరమైనదని ఓ కవి అన్నారు. ఇపుడా మౌనాన్నే చంద్రబాబునాయుడు తట్టుకోలేకపోతున్నారా ? తనపై వస్తున్న ఆరోపణలకు జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవటాన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలు, విమర్శలను చూస్తే అందిరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అసెంబ్లీ మాజీ స్పీకర్ కెడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో కూడా చంద్రబాబు వైఖరి దీన్నే నిర్ధారిస్తోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి తన పనేదో తాను చేసుకుపోతున్నారు. వివిధ శాఖలపై పట్టు పెంచుకునేందుకు శాఖల వారీగా సమీక్షలు జరుపుతున్నారు. ఉన్నతాధికారులతో వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాదయాత్ర, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బిజిలో ఉన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై విచారణలు చేయిస్తున్నారు.

 

సరే  ఈ విషయాలు ఇలా ఉంటే గడచిన మూడు నెలల పాలన విషయంలో జగన్ పై చంద్రబాబు ఆరోపణలు మొదలుపెట్టేశారు. అనేక అంశాలపై చంద్రబాబు ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారు. అయితే ఏ విషయంలో కూడా  జగన్ ఏమాత్రం స్పందించటం లేదు.  చంద్రబాబు అండ్ కో  ఎంతగా రెచ్చ గొడుతున్న జగన్ లెక్క చేయకుండా తన పనేదో తాను చేసుకుపోతున్నారు.

 

ఇక్కడే జగన్ అంటే చంద్రబాబు మండిపోతున్నారు. సిఎం అయిన మూడు నెలల్లో జగన్ ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టటం లేదు. తాను ఎంత రెచ్చగొడుతున్న జగన్ మాత్రం స్పందించకపోవటాన్ని చంద్రబాబు అవమానంగా ఫీలవుతున్నారు. పైగా తన ఆరోపణలకు, విమర్శలకు మంత్రులు, ఎంఎల్ఏలు స్పందించటాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు.

 

చంద్రబాబు ఉద్దేశ్యంలో తాను చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు జగన్ మాత్రమే స్పందించాలన్నట్లుగా ఉంది. కానీ జగన్ ఏమో మాట్లాడటం లేదు. దాన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఇసుక బ్యాన్, చలో ఆత్మకూరు, కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు, కోడెల ఆత్మహత్య ఘటనలో కూడా చంద్రబాబు చేస్తున్న రాజకీయాన్ని జగన్ పట్టించుకోవటం లేదు. చంద్రబాబు బాధేమిటో గమనించి ఒకసారి స్పందిస్తే సరిపోతుంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: