మామూలుగా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడే ముందు తమ చావుకు కారణాలు ఏమిటి అన్న విషయాలను స్పష్టంగా వివరిస్తు లేఖలు రాయటం సహజంగా జరిగేదే.  అందుకనే ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని తెలియగానే ముందు సూసైడ్ నోట్ కోసం వెతుకుతారు అందరూ. కానీ రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న అసెంబ్లీ మాజీ  స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు అటువంటి లేఖ ఏదీ రాయలేదు.

 

ఇక్కడే చంద్రబాబునాయుడు అండ్ కో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలే అని తేలిపోతోంది.  కోడెల ఆత్మహత్యకు జగన్ ప్రభుత్వంమే కారణమంటూ ఒకటే గగ్గోలు పెడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. కాసేపు అదే నిజమని అనుకుందాం. తన మృతికి జగన్ ప్రభుత్వమే కారణమైతే అదే విషయాన్ని కోడెల సూసైడ్ నోట్ లో చెప్పేవారే కదా ?

 

నిజంగానే ప్రభుత్వమే తనను ఆత్మహత్య చేసుకునే దిశగా ప్రేరిపేస్తే అదే విషయాన్ని సూసైడ్ నోట్ లో తప్పక చెప్పేవారనటంలో ఎవరికీ సందేహం లేదు. అసలు సూసైడ్ నోటే ఎందుకు రాయలేదు ? ఎందుకంటే కోడెలను మానసికంగా క్షోభకు గురిచేసింది ప్రభుత్వం పెట్టిన కేసు కాదు. కోడెలకు కేసులూ కొత్త కాదు. పోరాటాలు కొత్త కాదు. కాకపోతే కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మితో పాటు చంద్రబాబు, టిడిపి నేతల వల్ల పడిన మానసిక  క్షోభే అసలైన కారణం అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

 

ఆ విషయాలను చెప్పలేకే సూసైడ్ నోట్ రాయలేదని అనుకోవాలి. నిజంగానే వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టటమే లక్ష్యమైతే అదే విషయాన్ని సూసైడ్ నోట్ లో కోడెల పెట్టేవారే. ఇక్కడ స్పష్టమవుతున్నదేమిటంటే కోడెల మానసిక క్షోభకు అసలు కారణం చంద్రబాబే కానీ వైసిపి ప్రభుత్వం ఎంతమాత్రం కాదని. వాస్తవాలు ఇలాగుంటే చంద్రబాబు అండ్ కో ఎదురుదాడి చేస్తు జగన్ ప్రభుత్వంపై బురద చల్లలాని ప్రయత్నిస్తుండటమే విచిత్రంగా ఉంది.

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: