చంద్రబాబునాయుడు ఏమి చేసినా ఇలాగే రివర్సు కొడుతుంటుంది. ఎందుకంటే ప్రత్యర్ధులపై బురద చల్లటమే రాజకీయంగా, ఎదుటి వాళ్ళని గబ్బు పట్టించటమే ధ్యేయంగా రాజకీయాలు చేస్తారు కాబట్టి. తాజాగా అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఆత్మహత్య  విషయంలో కూడా ఇలాగే శవ రాజకీయాలు మొదలుపెట్టటంతో రివర్సు కొడుతోంది.


నిజానికి అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసు విషయంలో పడిన కేసు తప్ప మరోటి లేదు కోడెలపై. కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం కోడెలపై ప్రభుత్వం 19 కేసులు పెట్టిందని, మానసికంగా వేధించిందని, మానసిక క్షోభను తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఒకటే గగ్గోలు పెట్టేస్తున్నారు. పనిలో పనిగా కొడుకు, కూతురు మీద కూడా ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులే అంటూ మండిపోతున్నారు.

 

ఇక్కడే చంద్రబాబు అండ్ కో చేస్తున్న శవరాజకీయాలు అందరికీ తెలిసిపోతోంది. చంద్రబాబు చేస్తున్న శవ రాజకీయాలతో టిడిపి నేతలే మండిపోతున్నారు. అందుకనే క్రియాశీలక సభ్యుడు అన్నపురెడ్డి నర్సిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కోడెలను చంద్రబాబు వెనకేసుకొస్తున్న తీరు అంతా అబద్ధమని చెబుతున్నారు. కోడెల కుటుంబం చేసిన అరాచకాలు అందరికీ తెలిసినా చంద్రబాబు మాత్రం వాళ్ళని వెనకేసుకు రావటమేంటంటూ నర్సిరెడ్డి మండిపోయారు.

 

అదే సమయంలో బిజెపి సీనియర్ నేతలు పురిపళ్ళ రఘురామ్, లక్ష్మీపతి రాజు కూడా చంద్రబాబుపై మండిపోతున్నారు. చంద్రబాబు వల్లే తాను మానసిక క్షోభ అనుభవించినట్లు తమతో కోడెల చెప్పుకుని బాధపడినట్లు చెప్పటం సంచలనంగా మారింది. చంద్రబాబు వైఖరి వల్లే తాను టిడిపిలో ఒంటరివాడిని అయిపోయినట్లు కోడెల బాధపడ్డారని వీళ్ళు చెప్పటంతో చంద్రబాబు రాజకీయమంతా రివర్సవుతోంది.  పైగా తమతోనే కోడెల మాట్లాడినట్లు చెబుతున్నారు కాబట్టి కాదని అనేందుకు కూడా లేదు. బాబు తీరు నచ్చకే కోడెల బిజెపిలో చేరాలని డిసైడ్ చేసుకున్నట్లు వీళ్ళు  చెబుతున్నారు. మరి వీళ్ళకు చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: