టీడీపీ సీనియర్ నేత,ఏపీ మాజీ స్పీకర్,కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య రాజకీయాల్లో ఎన్నో మలుపులు తిరుతుంది.దీనిపై నాయకులెందరో తీవ్ర స్దాయిలో విరుచుకు పడుతున్నారు.ఇక ప్రతి విషయంలో తలదూర్చే అంబటి ఈ మరణం పై ఊహించ లేనంతగా చంద్రబాబుపై ధ్వజమెత్తాడు.శివప్రసాదరావుది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఖండించారు.కోడెల ఆత్మహత్యను టీడీపీ జగన్ కు ఆపాదించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.కష్టకాలంలో కోడెలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మొఖం చాటేసిన చంద్రబాబు చనిపోయాక శవరాజకీయాలకు పాల్పడుతున్నారని అంబటి ఆరోపించారు...



టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తాము బలంగా నమ్ముతున్నామని ఆయన ఆరోపించారు.ఇక కోడెల ఆత్మహత్యపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కోడెల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సాటిమనిషని ఆలోచించకుండా చంద్రబాబు పక్కనపెట్టారని అంటూ మండిపడ్డారు.ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు మరణాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునే నీచమైన ఎత్తుగడ వేశారని అంబటి తీవ్రవ్యాఖ్యలు చేశారు.నిజంగా చంద్రబాబుకి కోడెలపై ప్రేమాభిమానాలు ఉంటే ఆయన వారసులుగా కొడుకుని,గాని కుమార్తెని గాని ప్రకటించాలన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని,నరసరావుపేట,సత్తెనపల్లి నుంచి పోటీ చేయిస్తానని ప్రకటించాలని డిమాండ్ చేశారు...



అంతేకానీ దొంగనాటకాలు వద్దంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.ఎన్నో పెద్ద పెద్ద కేసులు ఎదుర్కొన్న కోడెలకు ఈ చిన్న చిన్న కేసులు లెక్క కాదన్నారు.కాని ఈ కేసులు ఆయనను నైతికంగా దెబ్బతీశాయని,అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు కానీ,పార్టీ కానీ అండగా నిలవలేక పోవడం వల్ల అవి ఆయనను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నెట్టివేయబడ్డాయన్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం బాబు పాకులాడుతున్నారని విమర్శించారు.కోడెల మృతికి ఆయన కుటుంబసభ్యులు,టీడీపీ తప్ప వైఎస్సార్సీపీ ఎంత మాత్రం కారణం కాదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు...

మరింత సమాచారం తెలుసుకోండి: