సచివాలయ ఉద్యోగుల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి .. పరీక్షలు నిర్వహించి రేపో ...  మాపో ఫలితాలు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇంకా కొంత మంది అభ్యర్థులు రాజకీయ నేతల చుట్టూ తిరుగుతూ రికమండ్ చేయమని చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఫలితాలు వెల్లడిస్తామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. జగన్ ఇప్పటికే సచివాలయాల ఉద్యోగాల్లో మంత్రుల జోక్యాన్ని, అవినీతిని సహించనని చెప్పుకొచ్చారు. దీనితో మంత్రులు కూడా ఎవరికీ హామీ ఇవ్వలేని పరిస్థితి. దళారులకు కూడా పరిస్థితి అర్ధం అయ్యి మా వల్ల కాదని అందరికీ చెబుతున్నారు. ఇదంతా జగన్ మార్క్ పరిపాలన అని వేరే చెప్పాల్సిన పని లేదు.


గత ప్రభుత్వంలో మంత్రులు .. ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయిన చంద్ర బాబు పట్టించుకోని పరిస్థితి. కానీ జగన్ మాత్రం మంత్రులకు ఇవ్వాల్సిన వార్నింగ్స్ ముందుగానే ఇచ్చారు. ఏపీ సీఎంగా జగన్ రాష్ట్రంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా తన పాలన ఉంటుందని .. తన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటీకే ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా కాంట్రాక్టు పనులు అత్యంత పారదర్శకంగా ఉండేందుకు జ్యూడిషల్ కమీషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ తీసుకువస్తున్నారు.


అదే సమయంలో జగన్ .. తన మంత్రి వర్గానికి గట్టిగ హెచ్చరికలు చేశారు. తన ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నెక్స్ట్ మినిట్ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని చెప్పారు. జగన్ .. ప్రభుత్వ కొలువుల్లో రాజకీయజోక్యాన్ని అసలు సహించనని .. అలా చేస్తే సిస్టమే చెడిపోతుందని .. ఈ వ్యవస్థను కాపాడటానికి ఈ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని మంత్రులకు జగన్ క్లాస్ పీకారు. ఇప్పటికే ఒక సెటిల్ మెంట్ లో దొరికిపోయిన మంత్రిని హెచ్చరించారు. అయితే గ్రామ సచివాలయాల్లో ఎటువంటి అవినీతి జరగడం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: