పాకిస్తాన్ మళ్లీ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోంది. భారత ఎన్నిసార్లు గుణపాఠం చెప్పినా తీరు మారడం లేదు.  భారత్ జమ్మూకశ్మీర్ పై ఉన్న ఆర్టీకల్ ౩౩౩ రద్దు చేసిన నాటి నుంచి  పాకిస్తాన్ నిప్పుల కుంపటిలా రగిలిపోతోంది. ఆర్టికల్ రద్దు చేయాలని చెబుతూ  ప్రపంచ దేశాల ముందు తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. చివరకు భారత్ విషయంలో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరును ప్రపంచ దేశాలు కూడా   వ్యతిరేకించాయి. తాజాగా మళ్లీ భారత్ పై కుట్ర పూరిత చర్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతోంది.

అయితే పాక్ కు కుట్ర రాజకీయాలు చేయడమే తప్పా...మరేం చేతకావడం లేదనే చెప్పాలి. భారత్ పై దొంగ దెబ్బతో పగ తీర్చుకోవాల్నదే పాక్ పక్కా ప్లాన్ వేస్తోందని ఇంటలిజెన్సీ వర్గాల ద్వారా బట్టబయలైంది. అయితే కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలన్న తన ప్రయత్నాలేవీ ప్రయత్నించక పోవడంతో పాకిస్తాన్ దేశం ఇప్పుడు మరో కుట్రకు రెడీ అవుతోంది. అంతర్జాతీయ సమాజం దృష్టిలో పడేలా నియంత్రణ రేఖ పొడవునా ఉగ్రవాదులను రప్పించేందుకు, కాల్పులకు తెగబడేందుకు భారీ కుట్ర చేస్తోంది. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు న్యూయార్క్ వేదికగా జరిగే ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) సందర్భంగా కశ్మీర్‌లో కల్లోలం రేపేందుకు పాక్  కుట్ర రచించినట్టు ఇంటలిజెన్సీ నిఘా వర్గాలు వెల్లడిచాయి. సెప్టెంబర్ 23న జరిగే క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌తో యూఎన్‌జీఏ ప్రారంభం కానుంది. అయితే తొలిసారి ప్రసంగించే ముగ్గురు వక్తల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఉన్నారు.

 

న్యూయార్క్, జెనీవాల్లోని జాతీయ భద్రతాధికారులు, దౌత్యాధికారులు చెబుతున్న దాన్నిబట్టి జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ప్రధానితో పాటు అమెరికా పర్యటనకు వెళ్లడం లేదని తెలుస్తోంది. యూఎన్‌జీఏలో పాకిస్తాన్  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించనున్న నేపథ్యంలో.. కశ్మీర్ లోయలో కల్లోలం సృష్టించే అవకాశాలున్నట్టు కేంద్రం అనుమానిస్తోంది. దీంతో అమెరికా పర్యటనకు వెళ్లకుండా జమ్మూ కశ్మీర్‌పై దృష్టి పెట్టాలని ఎన్ఎస్ఏ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: