ప్రజా ఆరోగ్యం మరియు వైద్య సేవలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య రంగం నిపుణుల కమిటీ ప్రభుత్వానికి 100కు పైగా సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధించాలని నిపుణుల కమిటీ సూచించింది. ఆ మేరకు వారికి జీతాలు పెంచాలని కూడా నిపుణుల కమిటీ సూచించటం జరిగింది. నిపుణుల కమిటీ సూచనలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. 
 
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో నవంబర్ 1వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నిపుణుల కమిటీతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. కమిటీ ఇచ్చిన నివేదికపై పూర్తి స్థాయిలో ఈరోజు చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రి ఆళ్ల నాని, డిప్యూటీ సీఎం కూడా ఈ చర్చలో పాల్గొన్నట్లు సమాచారం. 2000 వ్యాధులను అదనంగా ఆరోగ్యశ్రీలో చేర్చబోతున్నారని సమాచారం. 
 
పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆరోగ్యశ్రీ పథకం మొదలు కాబోతుంది. ఈ చర్చలో దీర్ఘకాలిక వ్యాధుల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కిడ్నీ బాధితులకు 10 వేల రుపాయల సహాయం గురించి కూడా చర్చించారని సమాచారం. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన జాబితాను తయారు చేయమని సీఎం నిపుణుల కమిటీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రభుత్వం 5,000 రుపాయలు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న వారికి ఖర్చుల నిమిత్తం 5,000 రుపాయలు అందించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. జిల్లా ఆస్పత్రులలో, మిగతా ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21వ తేదీ నుండి ఆరోగ్యశ్రీకు సంబంధించిన హెల్త్ కార్డులు జారీ చేయబోతున్నారని సమాచారం. 




మరింత సమాచారం తెలుసుకోండి: